కుక్క పుట్టిన రోజున ఆమె ఏం చేసిందంటే...

పెంపుడు జంతువులతో స్నేహం చేసిన వ్యక్తి వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అవి ఎంతో విధేయ‌త చూపిస్తాయి.జంతువులను ప్రేమించే వ్యక్తులకు వారి  పెంపుడు జంతువులు స్నేహితులు.

 The Owner Gave A Party On The Birthday Of Her Favorite Dog Birthday, Favorite D-TeluguStop.com

కుటుంబ సభ్యుల కంటే తక్కువ కాదు.జంతుప్రియులు తమ పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ఏదోఒక‌టి చేసినట్లు కనిపించడానికి ఇదే కారణం.

పెంపుడు జంతువులలో కుక్కలు చాలా ప్రత్యేకమైనవి.కుక్కలను ప్రేమించే వారు వాటి కోసం ఏమైనా చేయగలరు అనే దానికి ఒక ఉదాహ‌ర‌ణ క‌నిపిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఇది కనిపించింది.@buitengebieden తన ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను షేర్ చేసింది, అక్కడ ఆమె 200 టెన్నిస్ బంతులను కుక్కల బి’డే పార్టీకి బహుమతిగా ఇచ్చింది.

అది  స్విమ్మింగ్ పూల్‌లో ఉంది.  చాలా కుక్కలు కలిసి సరదాగా గడిపాయి.

గోల్డెన్ రిట్రీవర్ డాగ్స్ పూల్ పార్టీ వీడియో చూసిన వారెవరైనా ఆశ్చర్యపోతున్నారు.పెంపుడు జంతువుపై ఆ యజమానురాలు ప్రేమను చూసి చాలా మంది స‌లాం చేస్తున్నారు.

కుక్క పుట్టినరోజు వేడుకలో అదే జాతి కుక్కల స్నేహితులను పిలిచారు.ఈ సందర్భంగా గోల్డెన్ రిట్రీవర్ 5వ పుట్టినరోజున కానుక‌గా 200 టెన్నిస్ బంతులను బహుమతిగా అంద‌జేసింది.

ఆ మహిళ బంతుల డబ్బాలను తీసుకొచ్చి నేరుగా ఆ స్విమ్మింగ్ పూల్‌లోకి విసిరింది.బంతులను చూసి ఆనందంతో దూకిన తన కుక్క త‌న‌ స్నేహితులను ఆహ్వానించింది.

అప్పుడు వాటిని ఆపడం ఎవ‌రివ‌ల్లా కాలేదు.అవ‌న్నీ కలిసి కొలనులో దూకాయి.

బంతుల‌తో చాలా సరదాగా గడిపాయి.  ఒకటి పైనుండి నీరు అందులో లెక్కలేనన్ని బంతులు… కుక్కలకు ఎక్క‌డ‌లేని ఉత్సాహం వ‌చ్చేసింది.తర్వాత వాటి సరదా గంటల తరబడి కొనసాగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube