ప్రపంచంలో చాలా వింతలు చోటుచేసుకుంటుంటాయి.సైన్స్ కూడా వివరించలేని విధంగా అవి ఉంటాయి.ప్రజలు ఇలాంటి వాటిని అద్భుతాలు అని అంటారు.ఏదైనా మంచి జరిగితే దానిని అద్భుతం అని, చెడు జరిగితే శాపం అని కూడా అంటారు.ఈరోజు మనం చెప్పుకోబోయే పల్లెటూరిలో ఏం జరుగుతుందో సైన్స్ కి కూడా ఇప్పటికీ అందలేదు.ఈ గ్రామంలో పుట్టేవారంతా ఆడపిల్లలే.
గత 12 ఏళ్లుగా ఇక్కడ ఒక్క మగబిడ్డ కూడా పుట్టలేదు.దీనికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు.
ఇది నమ్మలేని నిజం.పెద్దపెద్ద శాస్త్రవేత్తలు కూడా ఈ రహస్యాన్ని ఇప్పటివరకూ ఛేదించలేకపోయారు.
ఈ రహస్య గ్రామం పోలాండ్‌లో ఉంది.ఇక్కడ స్థిరపడిన మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ గ్రామంలో పన్నెండేళ్లుగా ఒక్క అబ్బాయి కూడా పుట్టలేదు.ఇక్కడ ఎవరూ గర్భం ధరించినా ఆడపిల్లే జన్మంచడం విశేషం.
ఈ గ్రామంలో ఎవరికైనా కొడుకు పుడితే భారీ పారితోషికం ఇస్తామని 2019లో ఈ గ్రామ మేయర్ ప్రకటించినట్లు సమాచారం.
అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఈ పారితోషికం అందలేదు.ఈ గ్రామం మొదటిసారిగా చర్చలలోకి వచ్చినప్పుడు శాస్త్రవేత్తలు దీనిని ఖండించారు.అయితే ఆ తర్వాత చాలా మంది శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసి ఇది నిజమేనని తేల్చారు.ఈ గ్రామానికి చాలా మంది జర్నలిస్టులు, టీవీ జర్నలిస్టులు కూడా వచ్చి దీరిపై రిపోర్టు చేశారు.
ఈ రహస్యాన్ని ఎవరూ ఛేదించలేకపోయారు.

Mijeske Odrzenski గ్రామంలో సుమారు మూడు వందల మంది నివసిస్తున్నారు.ఇక్కడ ఆడపిల్లలే పుడతారని స్థానికంగా జరిగిన ఉత్సవం ద్వారా ప్రపంచానికి వెల్లడైంది.ఏ కుటుంబంలోనైనా మగబిడ్డ పుడితే ఆ కుటుంబానికి రివార్డు అందజేస్తామని మేయర్ ప్రకటించారు.
ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు చేసిన పరిశోధనలో స్పష్టంగా వెల్లడికాలేదు.ఇప్పటికీ చాలా మంది పరిశోధకులు ఇక్కడి మహిళలు ఎందుకు మగపిల్లలను కనడం లేదో తెలుసుకోలేకపోతున్నారు.
అయితే దీనికి గల కారణం త్వరలోనే తెలుసుకుంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.







