సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల సందర్భంగా ఖమ్మం నగరంలో సంబరాలు అంబరాన్ని అంటాయి .జిల్లా అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే సంబరాలు పేరంభమయ్యాయి .
శ్రీనివాస థియేటర్ అంతా పెళ్లి వాతావరణం సంత్రించుకుంది .రంగురంగుల తోరణాలు , పెద్ద పెద్ద ఫ్లెక్సీలులతో హాలు మొత్తంఆలంకరించారు .మహేష్ బాబు , కిషోర్ బాబు ల 40 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి దానికి పాలాభిషేకం చేసి ,100 కొబ్బరికాయలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు .దేవభక్తుని కిషోర్ , మహేష్ బాబు బొమ్మలతో కూడిన టీ షర్ట్స్ ను ధరించిన అభిమానులు నూతన ఉత్సాహంతో శ్రీనివాస థియేటర్ నుండి మయూరి సెంటర్ , పాత బస్టాండ్ , మున్సిపాలిటీ నుండి మళ్లీ థియేటర్ వరకూ సినిమా హీరో మహేష్ బాబు , కృష్ణ అభిమానులతో కలిసి భారీగా ర్యాలీని నిర్వహించారు .అనంతరం థియేటర్ ఆవరణంలో కేక్ కట్ చేసి సర్కార్ పాట సినిమా వేడుకలను ఘనంగా నిర్వహించారు .అభిమానుల కోలాహలంతో కేరింతలు వేశారు .ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తోట రంగారావు , నగర అధ్యక్షులు మునగాల బాలు , జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు చింతమల్ల గురుమూర్తి , నగర కార్యదర్శి మాలోతు మాని , కన్వీనర్ సంపత్ , సహాయ కార్యదర్శి నల్లబెల్లి గౌతమ్ , జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రి మోహన్రావు , పెనుగు మహేష్ , 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు .







