ప.మ బంగాళా ఖాతంలో కొనసాగుతోన్న అసాని తుపాను….
మచిలీపట్నం కు ఉత్తర ఈశాన్యంగా 40 కిమీ దూరంలో కేంద్రీకృతం… ఈసాయంత్రానికి దిశ మార్చుకుని ఈశాన్యదిశగా పయనం….తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేసించే అవకాశం….
అనంతరం విశాఖపట్నం మీదుగా పయనం.గంటకు 70-80 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం….
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకూ వుండే పోర్ట్ లలో ఏడో నెంబర్ ప్రమాదం హెచ్చరికలు జారీ… కృష్ణ, ప.గో, తూ.గో జిల్లాల తీర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకి వస్తుందని హెచ్చరికలు….రేపు సాయంత్రం వరకూ తుపాను ప్రభావం కొనసాగే అవకాశం….
ప్రస్తుతం గంటకు 55-65కిమీ వేగంతోగాలులు.అప్పుడప్పుడూ 70కిమీ వేగంతో గాలులు.
తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు







