రాజకీయ అనుభవం ఉండి ఆర్టీసిపై అర్దరహిత ఆరోపణలు చేస్తూ మిడిమిడి జ్ఞానంతో ఈటెల మాట్లాడటం సరికాదని, మతి భ్రమించి మాట్లాడుతున్నట్లు గా ఉందని తెరాస శ్రేణులు ఘాటుగా స్పందించారు.
బిజేపి ఎమ్మేల్యే ఈటెల రాజేందర్ ఖమ్మం వచ్చిన సందర్భంగా ఏం మాట్లాడాలో తోచక తనకున్న మిడిమిడి జ్ఞానంతో ఆర్టీసి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఖమ్మం వీడియోస్ కాలనీ లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో టిఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షడు పగడాల నాగరాజు అధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణా గారు, కార్పొరేటర్లు కమర్తపు మురళీ గారు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ గారు, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం గారు, AMC చైర్మన్ లక్ష్మి ప్రసన్న గారు, TRSKV నాయకులు పాల్వంచ కృష్ణా, పాషా తెరాస నాయకులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఖమ్మంకు విచ్చేసిన ఈటెల రాజేందర్ వచ్చిన పని చుస్కోని వెళ్లకుండా తనకి సంబంధం లేని అంశాలను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసమే మంత్రి పువ్వాడ పై బురదజల్లే కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకున్నారని విమర్శించారు.
దమ్ముంటే ఖమ్మం అభివృద్ధిపై మాట్లాడండి.
చేసిన అభివృద్ధిపై అడగండి.ఇంకా మా ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తుంది అని అడగాలని హితువు పలికారు.
ఇక్కడ బిజేపి రాజకీయ లబ్ధిపొందాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తోందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడిసి కొడుతున్న ఇంకా సిగ్గు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోందని అన్నారు.
ఆర్టీసి గురించి మీకు అన్ని తెలుసు.
సంస్ధ ఎప్పుడు లాభాల్లో లేదని, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజా రవాణాను కొనసాగించాలనే సంకల్పంతో కోట్ల రూపాయల నిధులు ఇస్తు సంస్థను బ్రతికిస్తున్నరని తెలిసి కూడా కేవలం ముఖ్యమంత్రి, మంత్రి పువ్వాడ, ప్రభుత్వం మీద బట్ట కాల్చి వేస్తున్నారని ద్వజమెత్తారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్, డీఏ ఇవ్వలేదని మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
ఆర్టీసి సమ్మె కాలంలో పక్కనే ఉన్నావుగా ముఖ్యమంత్రి కేసీఅర్ గారు నాడు ఉద్యోగులకు సమ్మె అనంతరం సమ్మె కాలం వేతనాలు ఇచ్చిన సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు.
ఆర్టీసీ సిబ్బందికి 44శాతం ఫిట్ మెంట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 13, 2015న నిర్ణయం తీసుకుని 2015 జూన్ నుంచి దీనిని అమలు చేసిన సంగతి తమరికి తెలుసు కదా మరి ఇవ్వలేదు అని ఎలా చెపుతున్నా ఆని అన్నారు.
అలాగే సమ్మె కాలంలో కార్మికులపై పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకున్న సంగతి గమనించాలన్నారు.
పక్కరాష్ట్రం ఏపీలో 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తే, ముఖ్యమంత్రి కేసీఅర్ గారు తెలంగాణలోని 55 వేల మంది ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన ఘనత కేసీఅర్ గారిది అన్నారు.
దాదాపు 4,200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని, దీనితో పాటు 5 శాతం డీఏ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేస్తున్నట్లు 2015 ఏప్రిల్ 25న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఆయా ఉత్తర్వుల ద్వారా ఆర్టీసీలో పనిచేస్తున్న 58,770 మంది కార్మికులకు ప్రయోజనం కలుగజేసిందన్నరు.
ఈ ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.20 కోట్ల అదనపు భారం పడినా పర్వాలేదని భావించి 2018 జూన్ 11న ఆర్టీసీ ఉద్యోగులకు 16శాతం ఐఆర్ (మధ్యంతర భృతి)ని ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.
ఆర్టీసీ సమ్మె కాలపు జీతాలు చెల్లించలేదని అనటం మీ మిడి మిడి జ్ఞానానికి నిదర్శనం అన్నారు.ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం 2019 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 28 ( 55 రోజులు) వరకు సమ్మె చేసారని, ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు వారికి సమ్మెకాలపు జీతాలను చెల్లిస్తానని ఇచ్చిన మాట ప్రకారం.
సమ్మెకాలాన్ని ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్ ) గా పరిగణిస్తూ 12 మార్చి, 2020న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.నాడు వారి జీతాలకై ప్రభుత్వం రూ.235 కోట్లను విడుదల చేసిన ఆయా జీతాలను 13 మార్చి, 2020 న కార్మికుల ఖాతాల్లో జమ చేశారని సమాధానమిచ్చారు.
ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు భద్రత లేదని తప్పుడు వ్యాఖ్యలను ఖండించారు.
ఆర్టీసీలో విధి నిర్వహణలో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నదంటున్న ఉద్యోగుల ఆవేదనలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిదృష్టికి తీసుకురాగా అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ గారి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ఆర్టీసీలో ఉద్యోగాలకు భద్రత కల్పించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించగా, ఈ మేరకు 5 ఫిబ్రవరి 2021న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.
ఇప్పటికైనా ఏదైనా అంశం గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడితే మీకే గౌరవంగా ఉంటుందని, అవగాహన రాహిత్యంతో మాట్లాడితే మీరే పలుచన అవుతారని హితువు పలికారు.







