రైల్వే ప్యాసింజర్లుకి శుభవార్త... మెరుగైన స్పీడుతో ఫ్రీ వైఫై వెసులుబాటు!

మనదేశంలో అత్యధిక జనం రైళ్లలోనే ప్రయాణిస్తారు.ఎందుకంటే ధర తక్కువ, పైగా సౌకర్యవంతం కనుక.

 Good News For Railway Passengers Free Wifi Facility With Better Speed , Railwa-TeluguStop.com

అయితే, ఈ క్రమంలో ప్రయాణికులు చాలాసార్లు కొన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతారు.అందులో ముఖ్యమైనది మొబైల్ ఫోన్స్ సరిగ్గా వర్క్ చేయకపోవడం.

అవును.కొన్ని రైల్వే స్టేషన్‌లలో మొబైల్ నెట్వర్క్ సరిగా పనిచేయదు.

ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే వారు ఉచిత పబ్లిక్ వైఫై సేవలు స్టార్ చేసారు.దానిలో భాగంగానే వలన వివిధ స్టేషన్ లలో ఈ సేవలు విస్తరించడం మనం చూడవచ్చును.అయితే ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు RailTel సిద్ధమైంది.‘ప్రధాన మంత్రి వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్ఫేస్’ ఆధారంగా వేగవంతమైన వైఫై సర్వీస్‌లను ప్రారంభించింది.

ఫస్ట్ ఫేజ్‌లో PM వాణి ఆధారంగా దేశంలోని 100 రైల్వేస్టేషన్‌లలో వైఫై సేవలకు శ్రీకారం చుట్టడం జరిగింది.వీటి పరిధిలో దాదాపు 2, 384 వైఫై హాట్‌స్పాట్‌లు ఉన్నట్టు సమాచారం.

ప్రస్తుతం 22 రాష్ట్రాల్లోని A1, A కేటగిరీలకు చెందిన 71 రైల్వేస్టేషన్‌లలో PM-WANI వైఫై సేవలను ‘రైల్‌ టెల్‘ షురూ చేసింది.వీటితో పాటు ఇతర కేటగిరీలకు చెందిన 29 స్టేషన్‌లలో కూడా ప్రాంభించడం హర్షణీయం.

క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న 6,102 రైల్వే స్టేషన్‌లకు ఈ ఫాస్ట్ వైఫై సర్వీస్‌ను విస్తరించనున్నట్టు రైల్‌ టెల్ తాజాగా తెలిపింది.ఈ ఏడాది జూన్ పూర్తయ్యేలోగా ఈ పక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది.

ప్రయాణికులు తమ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ కి వెళ్లి, Wi-DOT యాప్‌ డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా PM-WANI వైఫై నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయవచ్చని రైల్‌టెల్ తెలిపింది.ఇకపోతే ప్రస్తుతం ఉన్న SSID (రైల్‌వైర్ సర్వీస్ సెట్ ఐడైంటిఫయర్) సాధారణంగానే పని చేయనుంది.

అయితే ఈ యాప్‌ ద్వారా అదనపు సదుపాయాలు లభిస్తాయి.ప్రతీసారి ఓటీపీ అవసరం లేకుండా ఒకేసారి కేవైసీని సమర్పిస్తే సరిపోతుందని రైల్‌టెల్ వెల్లడించింది.

C-DOTతో కలిసి రైల్‌టెల్ ఈ యాప్‌ను డెవలప్ చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 6,102 రైల్వే స్టేషన్‌లలో ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ వైఫై సేవలను అందిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube