వర్షం కురవడం లేదా ఫ్లడ్ లైట్స్ టర్న్ ఆఫ్ కావడం వల్ల క్రికెట్ మ్యాచ్ లు అప్పుడప్పుడు ఆగిపోతుంటాయి.ఇవే కాకుండా ఒక్కోసారి లైవ్ క్రికెట్ లో అత్యంత విచిత్రమైన ఘటనలు వల్ల మ్యాచ్ కు అంతరాయం కలుగుతుంది.
తాజాగా కూడా అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియోని ఇంగ్లాండ్‌కు చెందిన బార్మీ ఆర్మీ ట్విట్టర్ పేజ్ షేర్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి మైదానంలోకి ప్రవేశించి, పిచ్ మధ్యలో తన స్కూటర్‌ను రైడ్ చేస్తున్నట్టు మీరు గమనించవచ్చు.
ఈ యువకుడి వల్ల క్రికెట్ మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.మ్యాచ్ సమయంలో అనేక మంది ఫ్యాన్స్ మైదానంలోకి ప్రవేశించిన సందర్భాలు కోకొల్లలు.కానీ ఏకంగా చిన్న స్కూటర్‌తో మైదానంలో చక్కర్లు కొడుతూ మ్యాచ్ కి అంతరాయం కలిగించడం ఇదే తొలిసారేమో.ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.అయితే ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఈ టీమ్స్ ఆడుతున్నప్పుడు యువకుడు స్కూటర్ నడిపాడు? వంటి వివరాలు ఇంకా తెలియ రాలేదు.

ఇదిలా ఉండగా భారత్ లో కూడా ఒకసారి అచ్చం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.ఢిల్లీ, యూపీ జట్లు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుండగా మైదానంలోకి ఒక కారు వచ్చింది.దీంతో ప్లేయర్లందరూ షాక్ అయ్యారు.ఈ మ్యాచ్ లో గౌతం గంభీర్ కూడా ఉండటం గమనార్హం.







