ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచానికి క్షణాల వ్యవధిలో ఇట్టే తెలిసిపోతుంది.అందులో ముఖ్యంగా జంతువులకు, పక్షులకు సంబంధించిన వీడియోలు అతివేగంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఇక అసలు విషయానికి వస్తే.తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మామూలుగా కుక్కలు తమ యజమానులను కాపాడేందుకు ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శిస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందుకే కాబోలు శునకాలను విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకుంటాము.
అయితే తాజాగా కుక్క ప్రమాదంలో ఉండగా దానిని ఓ మహిళ కనురెప్పపాటు సమయంలో కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
శునకాలకి వాటి యజమానులకు ఎంత విడదీయలేని బంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.శునకాలు వాటి యజమానులకు ఏదైనా కీడు జరిగే సమయంలో ఎంతటి ధైర్యసాహసాలు చేసైనా వారి ప్రాణాలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాయి.
కేవలం శునకాలు మాత్రమే కాదు.శునకాల యజమానులు కూడా వారి కుక్కలకు ఏదైనా కీడు సంభవిస్తే వాటిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు.
ఇకపోతే తాజాగా జరిగిన సంఘటన ఇంగ్లాండ్ దేశంలోని కెంట్ లో జరిగినట్లుగా తెలుస్తోంది.

ఓ ఇంటి యజమాని తనకు ఏదో పార్సల్ వచ్చిన సమయంలో అది తీసుకుంటున్న సమయంలో.వారి ఇంటి పై రూమ్ లోని కిటికీ తెరిచి ఉండడంతో వారి పెంపుడు కుక్క దానిలో నుంచి చూస్తుంది.అదే సమయంలో అది కిటికీలోంచి జారి కింద పడిపోయింది.
దాంతో వెంటనే అప్రమత్తమైన యజమానురాలు వెంటనే కుక్క ను గాల్లోనే ఒడిసిపట్టుకుంది.దీంతో నెటిజెన్స్ ఆ లేడీని ” సూపర్ లేడి “ అంటు తెగ కామెంట్లు చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించండి.







