అలనాటి తార అభిమానులంతా ఎంతో ఇష్టంగా పిలుచుకునే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
కానీ ఇప్పటికి కూడా ఈమె ఎంట్రీ అనేది నిజం అవ్వలేదు.అయితే ఈమె ఎంట్రీ కి ఆమె తండ్రి బోణీ కపూర్ నే అడ్డు వస్తున్నాడట.ఈమె తండ్రి సలహాలు, సూచనలతోనే ప్రతి సినిమాకు ఓకే చెబుతుందట.జాన్వీని ముందుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ను చేయాలనీ బోణీ కపూర్ కల అట.
ఒకవేళ ఈమె సౌత్ లో ముందుగానే వస్తే బాలీవుడ్ లో మళ్ళీ స్టార్ హీరోయిన్ అవ్వలేదు అనే ఉద్దేశంతో బోణీ కపూర్ ఈమెను సౌత్ లో నటించకుండా చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తున్నాయి.

ఈ అమ్మడు బాలీవుడ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కు కోవడానికి ప్రయత్నిస్తుంది.ఈమె నటించిన మొదటి సినిమా ఓకే అనిపించింది.ఆ తర్వాత రెండు సినిమాలు నటన పరంగా ఓకే అయినా ఈమెకు మాత్రం స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ మాత్రం తీసుకురాలేక పోయాయి.

ఈమె ఎంట్రీ ఇవ్వడం లేదు అని మనమంతా అంతగా అనుకుంటుంటే అసలు కారణం మాత్రం జాన్వీ తండ్రి బోణీ కపూర్ అనే విషయం బయట పడింది.అందుకే బోణీ కపూర్ సౌత్ లో ఈమెకు ఎన్ని అవకాశాలు వచ్చిన వద్దు అనుకుంటున్నారట.ముందుగా ఈయన తన కుమార్తెను బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ చేయాలనీ గట్టి ప్రయత్నం మీద ఉన్నాడట.మరి అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత అయినా జాన్వీ ఇక్కడ నటిస్తుందో లేదా స్టార్ హీరోయిన్ అయింది అనే ఉద్దేశంతో నటించదో చూడాలి.







