సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్రబృందం.అయితే ఈ ఈవెంట్ లో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు తమన్ చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కళావతి పాటను మొదటిసారిగా వినిపించినప్పుడు పరశురామ్, కీర్తి సురేష్, మహేష్ ల రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన తమన్ కళావతి ట్యూన్ నీ లాక్ డౌన్ లో చేశామని తెలిపారు.2020 జూన్ లోనే ఈ ట్యూన్ అయిందని, దర్శకుడు పరశురామ్ అయితే ఈ పాటను లాక్ డౌన్ లో ఎన్నోసార్లు విన్నాడంటూ కారులోనే పాట పెట్టుకుని హైదరాబాద్ మొత్తం తిరిగి చేశాడు అని చెప్పుకొచ్చాడు థమన్.కీర్తి సురేష్ కు ఈ పాటను చాలా రోజుల తర్వాత వినిపించామని, అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకరోజు నేను ఆమెను హోటల్ లో డ్రాప్ చేయాల్సి రాగా ఆ రోజు ఆ సమయంలో ఆమెకు ఆ పాటలు వినిపించాను అని తమన్ చెప్పుకొచ్చాడు.

దీంతో ఆడియన్స్ ఒక్కసారిగా గట్టి గట్టిగా అరుస్తూ గోలగోల చేయడంతో, అప్పుడు తమన్ స్పీచ్ ను పక్కన పెట్టి మరీ అంత లేదు రా అని స్టేజి మీద సిగ్గు పడ్డాడు.ఇక అప్పుడు సుమ ఆ విషయాన్ని మరింత లాగే ప్రయత్నం చేయగా.మీరు ఏం చెప్పారు వాళ్ళకి అర్థం అయింది అన్న విధంగా సినిమా కౌంటర్ వేసింది.
కానీ తమన్ మాత్రం ఆ విషయాన్ని దాటకుండా సమాధానం చెప్పేశాడు.కీర్తి సురేష్ వయలిన్ ప్లేయర్ అని ఆమెకు పాట బాగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు తమన్.
ఇకపోతే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.







