సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.ఈ నెల 12వ తేదీన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
అయితే మహేష్ బాబు తన సినీ కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలలో మొత్తం 13 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో యమలీల అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాతో మహేష్ బాబును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నా కృష్ణ అంగీకరించకపోవడంతో మహేష్ బాబు ఈ సినిమాలో నటించలేదు.
తరుణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో నువ్వే కావాలి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నటించే అవకాశం మహేష్ బాబుకు దక్కగా కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమాలో అవకాశాన్ని వదులుకున్నారు.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇడియట్ సినిమాలో నటించే ఛాన్స్ మహేష్ బాబుకు దక్కగా మహేష్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశారు.ఎం.ఎస్.రాజు నిర్మాతగా వీఎన్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన మనసంతా నువ్వే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా మహేష్ ఈ ఆఫర్ ను కూడా వదులుకున్నారని సమాచారం.లీడర్ , ఏ మాయ చేశావె, రుద్రమదేవి సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినా మహేష్ వదులుకున్నారు.

ఫిదా, 24, అఆ సినిమాలలో నటించే ఛాన్స్ దక్కగా మహేష్ బాబు ఆ అవకాశాలను కూడా వదులుకున్నారని తెలుస్తోంది.నాని గ్యాంగ్ లీడర్, పుష్ప సినిమా కథలను కూడా మహేష్ బాబు రిజెక్ట్ చేశారు.ఈ విధంగా మొత్తం 13 బ్లాక్ బస్టర్ హిట్లను మహేష్ బాబు తన సినీ కెరీర్ లో వదులుకున్నారని సమాచారం.
ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు గజిని సినిమాను కూడా వదులుకున్నారని సమాచారం.







