తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కలిశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్మితమైన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలకు మౌలిక సదుపాయాల కల్పన కొరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య హైదరాబాద్ నందు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ని వారి కార్యాలయం నందు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.







