లౌకిక భారత దేశాన్ని కాపాడుకుందాం..ఉద్యోగాల సాధనకై ఉద్యమిద్దాం:-డివైఎఫ్ఐ

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ పదకొండవ జాతీయ మహాసభలు పశ్చిమ బెంగాల్ కలకత్తా నగరంలో 24 పరగణాల జిల్లా సాల్ట్ లేక్ లో మే 12 నుంచి 15 వరకూ జరుగుచున్నవి.ఈ మహాసభల సందర్భంగా మే 12 న కలకత్తా జరిగే యువజన వ్యాలీ ని బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు.

 Let's Save Secular India..let's Work For Job Achievement: -dyfi-TeluguStop.com

స్థానిక సుందరయ్య భవన్లో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్.బషీరుద్దీన్ మాట్లాడుతూ లౌకిక భారత దేశాన్ని కాపాడుకుందాం, ఉద్యోగాల సాధనకే ఉద్యమిద్దాం అనే నినాదంతో ఈ మహాసభలు జరగబోతున్నాయి ఈ మహాసభల సందర్భంగా కలకత్తా నగరంలో యువజన వ్యాలీ మరియు బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు, ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ, బెంగాల్ సిపిఎం పార్టీ కార్యదర్శి మొహమ్మద్ సలీం, డివైఎఫ్ఐ ఆలిండియా కార్యదర్శి అభయ్ ముఖర్జీ, డివైఎఫ్ఐ బెంగాల్ కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ, డివైఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు MAరహీం ఇంకా ఇతర దేశ రాష్ట్ర నాయకులు హాజరు కాబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ జిల్లా కమిటీ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు షేక్ రోషని ఖాన్, చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, గుమ్మ ముత్తా రావు, శీలం వీరబాబు, కూరపాటి శ్రీను, మధులత, జక్కంపూడి కృష్ణ, పొన్నం మురళి, సాయి, బొడ్డు మధు,చిత్తరు మురళి, వర్షిత్, విజయ్, నాగరాజు, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube