కీర్తి సురేష్‌ జోరు చూస్తుంటే సెంటిమెంట్‌ బ్రేక్‌ చేసేలాగే ఉందిగా!

మహా నటి సినిమా తో స్టార్‌ డమ్ దక్కించుకుని పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఒక్క సినిమా తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత ఏ ఒక్క సినిమా తో కూడా కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్ ను తెలుగు లో దక్కించుకో లేక పోయింది.కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఈమె నటించిన తమిళ సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.

 Mahesh Babu Sarkaaru Vaari Pata Movie Keerthu Suresh Fans Happy , Flim News, Kee-TeluguStop.com

అయినా కూడా ఈమె క్రేజ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఈమె సినిమా వస్తే నోరు వెళ్లబెట్టి చూసే వారు చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు మహేష్‌ బాబు తో కలిసి సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Sarkaruvaari-Movie

ఈమె సినిమా బాక్సాఫీస్ ను షేక్‌ చేస్తుందని కొందరు అంటే మరి కొందరు మాత్రం అంత సీన్ లేదు.ఆమె సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని మరి కొందరు అంటూ ప్లాప్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సమయంలో సర్కారు వారి పాట సినిమా నుండి మ మ మహేష్‌ పాట ప్రోమో విడుదల అయ్యింది.

ఈ ప్రోమో చూస్తుంటే కీర్తి సురేష్‌ మాస్ మహా జాతర ఈ సినిమా లో చూడబోతున్నాం అని.ఆ పాటలో ఆమె జోరు చూస్తే కళ్లు చెదిరి పోవాల్సిందే అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు.ఆ వీడియో తో ఖచ్చితంగా సినిమా స్థాయి పెరిగింది.పాటలో కీర్తి సురేష్‌ మాస్ లుక్ చూస్తుంటే ఈ సారి కుమ్మేయడం ఖాయం గా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో కీర్తి సురేష్ చేస్తున్న హడావుడి చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తూ ఈసారి కీర్తి సురేష్ ప్లాప్‌ సెంటిమెంట్‌ ను ఈ మాస్ తో బ్రేక్ చేసేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube