రాహుల్ రాకతో చంచల్‎గూడ జైలు వద్ద టెన్షన్..టెన్షన్

ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ కాసేపట్లో చంచల్‌గూడ జైలులో ఎన్‌ఎస్‌యూఐ నేతలను కలవనున్నారు.రాహల్ పర్యటనకు అనుమతివ్వాలంటూ.

 Tension Environment At Chanchalguda Jail On The Arrival Of Rahul Gandhi Details,-TeluguStop.com

ఓయూ వద్ద ఆందోళనకు దిగిన ఎన్ఎస్‎యూఐ విద్యార్థులను… అరెస్ట్ చేసి చంచల్‎గూడ జైలుకు తరలించారు.ఈ మేరకు విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.

కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు.నిన్న వరంగల్‎లో పర్యటించిన రాహుల్. ఇవాళ హైదరాబాద్‎లో పర్యటిస్తున్నారు.ఉదయం తాజ్ కృష్ణాలో ముఖ్యనేలతో భేటీ అయి తెలంగాణలో పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు.

అనంతరం తెలంగాణ ఉద్యమ కారులతో భేటీ అయ్యారు.

కొద్దిసేపటి క్రితం సంజీవయ్య పార్క్‎లో దామోదర సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పించారు.

అక్కడ నుంచి చంచల్‎గూడ జైలు‎కు బయల్దేరారు.కాసేపట్లో ఎన్ఎస్‎ఐ విద్యార్థులను పరామర్శించనున్నారు.

ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్ద ఉత్కంఠత నెలకొంది.రాహుల్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు జైలు వద్ద భారీగా మోహరించారు.

విద్యార్థులను కలిసేందుకు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మాణికం ఠాగూర్‎కు అధికారులు అనుమతి ఇచ్చారు.

ఇక విద్యార్థులను పరామర్శించిన తర్వాత గాంధీభవన్‌‌కు రాహుల్.

వెళ్లానున్నారు.

Telugu Farmers, Jagga, Manikyam Thakur, Rahul Gandhi, Rahul Warangal, Warangal-P

అక్కడ పార్టీ సీనియర్‌ నేతలతో రాహుల్‌ భేటీ అవుతారు.ఆ తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ వెళ్లనున్నారు.రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో తొలిరోజే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.

తొలిరోజు వరంగల్ సభకే రాహుల్ పరిమితమైనా.తన ప్రసంగం ద్వారా.

రైతు కుటుంబాలను పరామర్శించి ప్రజల్లో ఉత్సాహం నింపారు.పార్టీ తరపున భరోసా ఇచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.

ఓరుగల్లు సభలో పలు కీలకాంశాలను రాహుల్ టచ్ చేశారు.వచ్చే ఎన్నికలకు పార్టీ ప్రచార అస్త్రాలను ప్రకటించారు.

ముఖ్యంగా రైతు సంఘర్షణ సమితి పేరిట నిర్వహించిన సభా వేదిక నుంచి తెలంగాణ రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ యత్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube