చిన్నారి గుండె ఆపరేషన్ కు స్పందించిన మహేష్ బాబు.వెంటనే మహేష్బాబు ఫౌండేషన్ నుండి హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ లో గుండెకు ఆపరేషన్ చేయించి అందరి మదిలో నిలిచాడు హీరో మహేష్ బాబు.
వరంగల్ నగరంలోని గీర్మాజీ పేటకు చెందిన భాను రవి దంపతుల కుమారుడు యశ్వంత్ మూడు సంవత్సరాలు.రవి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు.
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి రవి కుటుంబ సభ్యులది. బాబు గుండెలో రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేయించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో.
వరంగల్ జిల్లా మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షులు గందె నవీన్ చొరవ తీసుకుని మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ వారితో మాట్లాడి ఏప్రిల్ 14 వ తేదీన గుండెకు ఆపరేషన్ చేయించారు.ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉందని తనకు సహకరించిన మహేష్ బాబు జిల్లా అధ్యక్షుడు నవీన్ తో పాటు ఇతర నాయకులను సన్మానించారు రవి దంపతులు.
సుమారు 1150 మంది చిన్నారులకు మహేష్బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుండెకు సంబంధించిన ఆపరేషన్లు జరిగాయని, ఖచ్చితమైన పేద పిల్లల కోసం తమ వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న మహేష్ బాబు కుటుంబ సభ్యులకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని మహేష్ బాబు ఫ్యాన్స్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గందె నవీన్ తెలిపారు
.






