టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతూ ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇకపోతే ఇటీవలే అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.అయితే బాలకృష్ణ తనదైన శైలిలో నటిస్తూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
వైవిధ్యభరితమైన పాత్ర లతో పాటుగా పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో కూడా నటించి కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు.తన సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న బాలకృష్ణ కూడా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
మరి బాలకృష్ణ వదులుకున్న ఆ 10 బ్లాక్ బస్టర్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్,మీనా జంటగా నటించిన చంటి సినిమా కథ నచ్చకపోవడంతో బాలకృష్ణ రిజెక్ట్ చేశారట.
ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన జానకి రాముడు సినిమా ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశాడట
కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

హీరో రాజశేఖర్ నటించిన సింహరాశి సినిమా ను కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేశారట.అలాగే వెంకటేష్ నటించిన సూర్యవంశం సినిమా ను కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేశారట.అలాగే జగపతి బాబు నటించిన శివరామరాజు, పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం, హీరో విక్టరీ వెంకటేష్ నటించిన బాడీగార్డ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలను బాలకృష్ణ రిజెక్ట్ చేశారట.
బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఈ పది సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం తో పాటు ఆ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాయి.







