కేంద్ర బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాల్సిందే..వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

ప్రభుత్వ- ప్రయివేటు రంగంలో అనవసర ఆపరేషన్లు చేస్తే కఠిన చర్యలు అనవసర పరీక్షలు చేసి రోగులను ఇబ్బంది పడితే మెడికల్ కౌన్సిల్ ద్వారా చర్యలు తప్పవు.ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువలోకి తీసుకెళ్తాం.

 Central Booster Dose Should Be Given For Free Medical Health Minister Harish Rao-TeluguStop.com

ప్రభుత్వ వైద్య సిబ్బంది పని చేస్తో ప్రోత్సాహం-నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు సహజకాన్పులు చేసిన వైద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రోత్సహాకాలు కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, tsmsidc చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.కరోనా టైంలో దేశ మంతా బ్లాక్ ఫంగస్, వై ట్ ఫంగస్ వల్ల అతలాకుతలం అయింది.

కాని సుల్తాన్ బజార్ ఈఎన్ టీ ఆసుపత్రి వైద్యులు మాత్రం బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కు మంచి చికిత్స అందించడం జరిగింది.

ఈ ఈఎన్ టీ ఆసుపత్రికి సీఎం గారు మరిన్ని డాక్టర్ పోస్టులు మంజూరు చేయడం జరిగింది.

ఇవాళ 35 కోట్లతో లక్ష ఎస్.ఎఫ్.టీ లో బిల్డింగ్ కట్టడం జరుగుతుంది.ఇందులో 100 పడకలు, 8 ఆపరేషన్ ధియెటర్లు ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది.ఇవాళ దీనికి శంకుస్తాపన చేయడం జరిగింది.2 కోట్లతో సిటీ స్కాన్ ను ప్రారంభించడం జరిగింది.ఈఎన్టీఆసుపత్రి పురాతనమైనది.అందుకే కొత్త బ్లాక్ కు శంకుస్థాపన చేయడం జరిగింది.త్వరలోనే పనులు ప్రారంభిస్తాము.కోటి మెటర్నిటీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ ను , ఐసీయూను, లేబర్ రూం ను ప్రారంభించుకోవడం జరిగింది.

నాలుగైదు రోజుల్లో వినియోగం లోకి తేవడం జరుగుతుంది.

నీలోఫర్ లో ఫ్రోఫెసర్ టీం 8 యూనిట్స్ ఉన్నయి.

పేట్ల బురుజులో 8 టీఎం యూనిట్స్ ఉన్నయి.కోటీలో మాత్రం రెండే యూనిట్స్ ఉన్నయి.

ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది.డీఎంఈకి ఆదేశించాం.

కొన్ని యూనిట్లు ఇక్కడకు తరలించమని చెప్పాం.రాబోయే రోజుల్లో పేట్ల బురుజు, నీలోఫర్ నుండి కొన్ని యూనిట్స్ కోటిికి అవసరానికి అనుగుణంగా తరలించి వై ద్య సేవలు అందించాలని ఆదేశించడం జరిగింది.

సీఎం గారు శానిటేషన్ ను బాగా చేయాలని గత బడ్జెట్ సమావేశాల్లో 5 వేల రూపాయల నుండి 7500 రూపాయలకు పెంచాం.పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేశాం.ఈ నెలలో కొత్త శానిటేషన్ పాలసీ తీసుకురానున్నాం.

150 నుండి 200 కోట్లు అదనంగా ఈఏడాది ఖర్చు చేయనున్నాం.దీని వల్ల శానిటేషన్ మెరుగుపడుతుంది. పది పది టెండర్లు వేయడం, సబ్ కాంట్రాక్ట్ కు ఇవ్వండ చేసేవారు.ఇప్పుడు రాష్ట్రంలో ఐదింటికి కన్నా ఎక్కువ టెండర్లు వేయడం కుదరదు.జీతాలు కూడా టైం కు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నం.

డైట్ కాంట్రాక్ట్ 40 రూపాయలు పర్ పేషంట్ ఉండేది, దాన్ని 80 కు పెంచాం.ఈ పాత కాంట్రాక్టులు రద్దు చేసి, కొత్తగా పిలుస్తున్నం.

దేశంలో తొలి సారి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది.రాబోయే పది – పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.

హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషంట్ల అటెండెంట్స్ కు మూడు పూటలా ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ మంత్రులు, శాసన మండలి, శాసన సభ్యులు ఆధ్వర్యంలో 18 ఆసుపత్రుల్లో ప్రారంభించనున్నాం.

పేషంట్లకు ఆసుపత్రుల్లో ఉచితంగా భోజనం అందిస్తున్నం.

మారుమూల ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వస్తారు కనుక సీఎం గారు షెల్టర్ హోమ్స్ కట్టాలి.

భోజనం పెట్టాలి అని నిర్ణయించారు.ఇప్పటిేకే షెల్టర్ హోమ్స్ కట్టాం.

ఇంకా కడతాం.కొత్తగా కట్టే నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల డిజైన్ లోనే షెల్టర్ హోమ్స్ కట్టాం.

గాంధీ ఆసుపత్రి బ్రిటీష్ ఆర్మీ కోసం పెట్టిన దవాఖానా, ఉస్మానియా ను నిజాం కాలంలో పెట్టాం.ఫస్ట్ టైం సీఎం కేసీఆర్ గారు 4 సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు కట్టాలని నిర్ణయించారు.6 వేల ప డకలు కరత్తగా పెట్టుకోబోతున్నాం.మెరుగైన సేవలు జంట నగరాలతో పాటు రాష్ట్ర ప్రజలకు అందనుంది.

హెల్త్ బడ్జెట్ రెట్టింపు చేశాం.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేశారు సీఎం గారు.రిక్రూట్ మెంట్ కూడా చేయబోతున్నాం.హెల్త్ డిపార్ట్మెంట్ ఖాళీలన్నీ నింపడానికి చర్యలు తీసుకుంటున్నం.కరోనా టైంలో పని చేసిన సిబ్బందికి వెయిటేజీ ఇస్తున్నం.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసావల సంఖ్య పెరిగింది.30 శాతం నుండి 56 శాతానికి పెరిగింది.26 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగాయి.ఇది కేసీఆర్ కిట్, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.హెల్త్ క్యాలెండర్ పెట్టుకుని దాని ప్రకారం ఆశా వర్కర్ నుండి ఉస్మానియా ఆసుపత్రి వరకు రివ్యూ చేయయడం జరుగుతుంది.

సూపరిండెంట్లకు పవర్స్,నిధులు ఇచ్చాం.చిన్న చిన్న మరమ్మతుల కోసం డబ్బులు పెట్టి వెంటనే చర్యలు తీసుకనేలా చేశాం.

సీ- సెక్షన్ రేట్ తగ్గడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాం.ప్రభుత్వ- ప్రయివేటు రంగంలో సీ సెక్షన్ రేట్ తగ్గించేందుకు ఫోకస్ గా పని చేస్తున్నం.

మాతా శిశు మరణాలు తగ్గించడం లో రాష్ట్రం తమినళనాడును దాటి మూడో స్థానంలో ఉంది.బ స్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్, టీ డయాగ్నసిస్ సర్వీసులు దేశానికి ఆదర్శంగా మారాయి.

తెలంగాణ మోడల్ అనుసరించి మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.పది రేడియాలజీ ల్యాబ్ లు హైదరాబాద్ లో ప్రారంభించనున్నాం.

ఈ నెల 11 వ తేదీన హైదరాబాద్ లో ఈ ల్యాబ్ లు ప్రారంభిస్తాం.ఇవి అల్ట్రా సౌండ్, టూడీ ఏకో, ఎక్స్ రే, మెమోగ్రఫీ పరీక్షలు హైదరాబాద్ బస్తీ వాసులకు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నం.

హైదరాబాద్ లో 12 పెట్టాలని నిర్ణయించాం.అందులో పది ఈ నెల 11 న ప్రారంభం.

మిగతా రెండు ల్యాబ్ లు తర్వలో ప్రారంభిస్తాం.గతంలో బస్తీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు ఎక్కువ- చేతలకు తక్కువ.కేసీఆర్ గారు బస్తీ ప్రజలకు వారి బస్తీల్లోనే ఉచితంగా వైద్య సేవలు, ఉచిత వై ద్య పరిక్షలు అందిస్తున్నం.

నిమ్స్ లో 2 వేలు పడకలు, గచ్చిబౌలి టిమ్స్, అల్వాల్, సనత్ నగర్, ఎల్బీనగర్ లో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మిస్తున్నం.ఇవి పెరుగుతున్న హైదరాబాద్ ప్రజలకు సేవలందిస్తాయి.

ధనికులకు మాత్రమే అందుబాటులోకి ఉండే హాట్ , లంగ్స్, రిప్లెస్మెంట్, నీ రిప్లెస్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా డాక్టర్లు పోటీ పడి చేస్తున్నరు.రాబోయే రోజుల్లో ఆరోగ్య శ్రీలో సేవలు ప్రజలు అందిస్తాం.

నార్మల్ డెలివరీకి ఇన్సెంటీవ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.మహిళలు వ్యాయామం చేయకపోవడం వల్ల నార్మల్ డెలివరీ కష్టమవుతుంది.

ఆశాలు, ఎ.ఎన్.ఎం ల ద్వారా వ్యాయమంవీడియోలు వాళ్ల ఫోన్లలో, ట్యాబ్స్ లో అప్ లోడ్ చేయించి గర్భిణీ స్త్రీలు వ్యాయమం చేసేలా చూడనున్నాం.

ఓపీ సేవలు ఇంప్రూ చేయాలని, ఈవినింగ్ ఓపీ హైదరాబాద్ లో చేయాలని, ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయింత్రం నుంచి చేయాలని ఆదేశించాం.

రాబోయే రోజుల్లో సాయింత్రం సైతం ఓపీ సేవలు అందిస్తాం.

పని చేసే వారికి ప్రోత్సాహం- పని చేయని సబ్బిందికి కఠిన శిక్షలు తప్పవు.

మెడికల్ కౌన్సిల్ ఆక్టివేట్ చేశాం.ఉద్దేశపూర్వకంగా ప్రయివేటు- ప్రభుత్వ రంగంలో కాని నిర్లక్ష్యం వహిస్తే ఆ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవు.

అవసరమైన మందులే వాడాలి.అవసరం మేరకే పరీక్షలు చేయాలి.

అవసరం మేరకే ఆపరేషన్లు చేయాలి.తప్పులు చేసినట్లు రుజువయితే కఠిన శిక్షలు తప్పవు.

కేంద్రం మంత్రికి వాక్సినేష్ ఉచితంగా ఇవ్వాలని లేఖ రాశాం.డబ్బులు తీసుకోవడం ఏంటి.కేంద్రం నుండి స్పందన లేదు.ఉచితంగా దేశ ప్రజలందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నం.

మరోసారి లేఖ రాస్తాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube