ప్రపంచవ్యాప్తంగా మే 6న ఆర్జీవీ మా ఇష్టం (డేంజరస్) విడుదల

డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. జానర్ ఏదైనప్పటికీ తాను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో దానికి తెర రూపమిస్తున్నారు.

 Rgv Maa Ishtam Dangerous Movie Releasing On May 6th World Wide Details, Rgv, Maa-TeluguStop.com

విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.దేశంలోనే తొలిసారి ‘మా ఇష్టం’ సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మా ఇష్టం (డేంజరస్) చిత్రాన్ని మే 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ.

ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ చేపట్టిన ఆర్జీవీ.ఆస్క్ ఎనీథింగ్ అనే కార్యక్రమం చేపట్టారు.హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు చిత్రంలో లీడ్ రోల్స్ పోషించిన నైనా గంగూలీ, అప్సర రాణి పాలొన్నారు.లెస్బియన్ శృంగారం విషయమై పలువురు స్టూడెంట్స్, రాముయిజం ఫాలోవర్స్ అడిగిన ఘాటైన ప్రశ్నలకు వర్మ ఓపెన్ గా సమాధానాలు చెప్పి మెప్పించారు.

ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని, గతంలో ఎన్నడూ చూడనివిధంగా ఉంటుందని ఆర్జీవీ చెప్పారు.

Telugu Apsara Rani, Ram Gopal Varma, Lesibian, Maa Ishtam, Naina Ganguly-Movie

ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి.ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే.

దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొంటూ వదిలిన ‘మా ఇష్టం’ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube