గెలవాలంటే ఓర్పు, సహనం ఉండాలి.అప్పుడే గెలుపు సాధ్యపడుతుంది.
దీని గురించి మనం కథలు కూడా విన్నాం.మనం చిన్నతనంలో విన్న తాబేలు, కుందేలు పరుగు పందెమే దీనికి ఉదాహరణ.
నిజజీవితం లోనూ దీనిని పాటిస్తే గెలుపు తధ్యం.ఇలాంటి సన్నివేశాన్ని నిదర్శనమైన ఘటన మరోసారి వెలుగు చూసింది.
ఓ చిన్నోడి విజయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఓ బుడ్డోడు ఎదుటి వారు ఆవేశపడినా.
సహనం, ఓర్పు, తెలివితో ఆట గెలిచి అందరినీ అబ్బురపరిచాడు.ఆ చిన్నోడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
ఓ నలుగురు పిల్లలు లెమన్ రేస్ ఆడాలని నిర్ణయించుకున్నారు.అందుకు నలుగురు నోట్లో స్పూన్ పెట్టుకొని ఆ స్పూన్ పై నిమ్మకాయల పెట్టుకుని రెడీ అయ్యారు.
విజిల్ మోగగానే తమ టార్గెట్ ను చేరుకోవడానికి పరుగు మొదలుపెట్టారు.ఆ స్పూన్‌లో పెట్టిన లెమన్‌ను కింద పడకుండా టార్గెట్ చేరుకోవాలి.అలా చేరితే విజయం సాధించినట్లు.లేదంటే ఓడిపోయినట్లు.
కాగా, ఆటలో పాల్గొన్న నలుగురిలో ముగ్గురు పిల్లలు గెలవాలనే ఉత్సాహంతో హడావుడిగా పరుగెత్తారు.కానీ, ఒక్క పిల్లాడు మాత్రం నిదానంగా, జాగ్రత్తగా ముందుకు నడుస్తూ సాగాడు.
ముందు నడిచిన ముగ్గురు చిన్నారు గమ్యం చేరకుండానే ఓడిపోగా.వెనకబడిన ఆ పిల్లాడు మాత్రం నిమ్మకాయ కిందపడకుండా జాగ్రత్తగా నడిచి విజయాన్ని సాధించాడు.
ప్రస్తుతం ఈ ఆటకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.అదికాస్తా వైరల్ అయ్యింది.పిల్లాడి ఓపిక, అతడి నేర్పును చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఈ వీడియోను ఇప్పటి వరకు 30 లక్షల మందికిపైగా వీక్షించారు.అంతే స్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి.అందుకే.
లక్ష్య సాధనలో ఓర్పు, సహనం ముఖ్యం అని పెద్దలు చెబుతారంటూ గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.