తమిళనాడులో తన మార్క్ పాలన చూపిస్తున్నారు ఎం.కె.
స్టాలిన్.ఇప్పటికే రాష్ట్రంలో తన పరిపాలనతో ప్రజల మెప్పు పొందుతున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త గుడ్ న్యూస్ తో ప్రజలకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలకు స్టాలిన్ ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.సాధారణంగా మూడు నుండి 12 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు సగం చార్జీని వసూలు చేస్తారు.
ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి తెచ్చారు.
తమిళనాడు రవాణా శాఖా మంత్రి ఎస్.ఎస్ శంకర్ అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు.అంతేకాదు తమ శాఖల్లో ఏర్పాటు చేయనున్న కొత్త కార్యక్రమాల గురించి ఆయన చెప్పారు.
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు ఎక్కువ దూరం వెళ్లే వారికి లగేజి స్థలంలో కొంత భాగం పార్శిల్, కొరియర్ సర్వీసులను ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు.ప్రయాణీకుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశ పెట్టిన ఈ ఫ్రీ బస్ చార్జ్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు.







