తెలంగాణా లో మరో నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని.ప్రజలు అప్రమత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న సందర్భంగా తెలంగాణాకు ఆరెంజ్ అరల్ట్ పరిస్థితులు ఏర్పడ్డాయి.కొన్నిచోట్ల గర్ష్టంగా 47 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న కారణంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.
రాష్ట్రంలో వడగాల్పులు, తీవ్రంగా ఉక్కపోత ఉన్నాయి.రాత్రి పూట కూడా ఉక్కపోత ఉంటుంది.
మే మధ్యలో ఉష్ణోగ్రత అధిక స్థాయికి చేరుతుంది.అయితే ఈ నెల మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయి.
సాధారణ పరిస్థితి కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.అయితే ఈ పరిస్థితి మరో నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నల్లగొండ, మెదక్, అదిలాబాద్ గర్ష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.ఇదేకాదు ఉపరితల ద్రోణి షిరంగా కొనసాగడం వల్ల రెండు మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడా వర్షాలు వస్తాయని చెబుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ప్రజలు అవస్రం ఉంటే తప్ప బయటకు రాకుండా ఉండాలని చెబుతున్నారు.







