కారులోకి దూరి కంట్రోల్ చేసి ప్ర‌మాదాన్ని త‌ప్పించిన వ్య‌క్తి.. ప్ర‌శంసిస్తున్న నెటిజ‌న్స్

ఒక్కోసారి కొన్ని వీడియోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.రోడ్డు ప్ర‌మాదాలు ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ఎక్కువగా సీసీ కెమెరాల‌లో రికార్డు అవుతుంటాయి.

 The Man Who Squeezed Into The Car And Escaped The Accident , Accident , Car Acci-TeluguStop.com

అవి చూసిన‌ప్పుడు షాక్ కి గుర‌వుతుంటాం.అయితే రోడ్డు ప్ర‌మాదాలు క్ష‌ణాల్లో జ‌రిగిపోతుంటాయి.

రెప్ప‌పాటులో ప్ర‌మాదం జ‌రిగి ప్రాణ న‌ష్టం జ‌రుగుతుంది.కొన్ని యాక్సిడెంట్స్ చూసిన‌ప్ప‌డు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది.

ప్ర‌మాదాన్ని ప‌సిగ‌ట్టి రెప్ప‌పాటులో వెహికిల్ ని తిప్పేస్తారు.లేదా.

మ‌రోదారికి డైవ‌ర్ట్ చేసి ఎదుటి వారి ప్రాణాల‌ను కాపాడుతుంటారు.ఇలా రోజుకు ఎన్నో వీడియోలు సోష‌ల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

కొంత‌మంది బైక్ పై వెళ్తూ స‌డెన్ గా కింద‌ప‌డిపోతుంటారు.బైక్ పూర్తిగా పాడ‌వుతుంది… కానీ ఆ వ్య‌క్తి కి ఏమి కాదు.ఇటువంటివి జ‌రిగిన‌ప్పుడు ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత చూస్తే ఇది ఎలా సాధ్య‌మైంద‌నే డౌట్ లో ఉంటాం.అలాగే మ‌రికొన్ని ప్ర‌మాదాల్లో.

కొండ‌ల‌పై ప్ర‌యాణాల్లో, పురాత‌న బ్రిడ్జిలపై ప్ర‌యాణాల్లో చూసిన‌ప్పుడు క్ష‌ణాల్లో ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డి ఊపిరి పీల్చుకుంటారు.ఇటువంటి ప‌రిస్థితుల‌లో కొంద‌రు ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా కాపాడ‌టానికి ముందుకొస్తారు.

ఎంతో రిస్క్ చేసి ఎదుటి వారి ప్రాణాల‌ను కాపాడుతుంటారు.అలాగే కారు ప్ర‌మాదాల్లో కూడా ఇలాంటివి చాలానే జ‌రుగుతాయి.

ప్ర‌స్తుతం ఓ కారు ప్ర‌మాదాన్ని రిస్క్ చేసి త‌ప్పించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.నిర్మానుష్యంగా ఉన్న ఓ చౌర‌స్తాలో ఓ మ‌హిళ న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఓ కారు స్పీడ్ గా దూసుకొస్తోంది.

అది గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి ప‌రిగెత్తుకెళ్లి కారులోకి దూకి హ్యాండ్ బ్రేక్ వేసి క్ష‌ణాల్లో ప్ర‌మాదాన్ని త‌ప్పించాడు ఇంకొంచెం ముందుకు వెళ్లి ఉంటే ఓ ఇంట్లోకి దూసుకెళ్లేది.దీంతో ఆ వ్య‌క్తి చేసిన సాహ‌సానికి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.

మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాంటి ప్రామాదాల‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube