సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అనిల్ రావిపూడి తనదైన మార్క్ టైమింగ్ తో, డైలాగ్ లతో వరుస విజయాలను అందు కుంటున్నాడు.
ప్రెసెంట్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
ఇక ఈయన చేస్తున్న ఎఫ్ 3 సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.
వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ పాటలు అన్ని కూడా అలరించాయి.
ఇక ఇటీవలే మరో పాట కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అప్పుడే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ నెల 9న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.మూడు వారాల ముందే ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు.అనిల్ రావిపూడి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ అవ్వలేదు.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నాడు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అప్పుడు సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చిన వెంకటేష్, వారు ఇప్పుడు సంక్రాంతి సోగాళ్లుగా రాబోతున్నారు.మరి ఈసారి సమ్మర్ సోగాళ్ళు ఎలా అలరిస్తారో చూడాలి.







