టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగిడేస్తున్న టీడీపి ! ఏంటి సంగతి ?

టిడిపి, టిఆర్ఎస్ మధ్య ఎప్పుడు వివాదమే నడుస్తూ ఉంటుంది.తెలంగాణలో టిడిపి ని టార్గెట్ చేసుకుంటూ టిఆర్ఎస్ రాజకీయ వ్యూహాలను రూపొందించింది.

 Ap Tdp Leaders Praising The Telangana Government Details, Trs, Telangana Governm-TeluguStop.com

రాష్ట్రంలో తెలుగుదేశం కి ఏమాత్రం అవకాశం లేకుండా టిఆర్ఎస్ చేయగలిగింది.ఇప్పుడు తెలంగాణలో టిడిపి పేరుకే తప్ప,  పెద్దగా కార్యకలాపాలు చేయడం లేదు.

అడపదడప టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ టిడిపి నాయకులు విమర్శలు చేస్తుంటారు.ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,  కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు ఏపీ లోని టిడిపి పైన విమర్శలు చేస్తుంటారు.

ముఖ్యంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూనే వస్తున్నారు.ఏపీ లో వైసీపీకి అనుకూలంగానే ఎప్పుడు టిఆర్ఎస్ వ్యవహరిస్తూ ఉండేది.

అయితే ఇటీవల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఏపీలో పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు అన్నట్లుగా మాట్లాడుతూ… ఏపీలో రోడ్లు సక్రమంగా లేవని,  కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని పెద్దగా అభివృద్ధి చోటు చేసుకోలేదు అంటూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.ఈ విషయం వైసీపీ నేతలకు ఆగ్రహం కలిగించింది.

ఆ తర్వాత కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.జగన్ తనకు సోదరుడు అంటూ వ్యాఖ్యానించి ఆ వివాదానికి పులి స్టాప్ పెట్టారు.

దీనినే రాజకీయంగా టిడిపి ఉపయోగించుకునేందుకు సిద్ధమైపోయింది.ఈ మేరకు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేలా టిడిపి ఏపీ నాయకులు మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది.
 

Telugu Ap, Chandrababu, Jagan, Lokesh, Somichandra, Telangana, Ysrcp-Political

తాజాగా మాజీ మంత్రి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడారు.తెలంగాణ ను చూసి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొన్ని అంశాలను నేర్చుకోవాలి అని సోమిరెడ్డి సూచించారు.తెలంగాణలో రైతుబంధు పేరుతో ప్రతి ఎకరానికి పది వేలు ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఏపీలో రైతు భరోసా ఉన్నా, ఒక్కో కుటుంబానికి 7500 మాత్రమే అందుతోందని చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

Telugu Ap, Chandrababu, Jagan, Lokesh, Somichandra, Telangana, Ysrcp-Political

వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్ సరఫరా పైన కూడా చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు.తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారని,  ఏపీలో మాత్రం తొమ్మిది గంటలు మాత్రమే చేస్తున్నారని , తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.వైసీపీ ప్రభుత్వం పై కేటీఆర్ విమర్శలు చేసిన క్రమంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై టిడిపి ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube