ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రక్తహీనత సమస్యతో తీవ్రంగా మదన పడుతున్నారు.ఒంట్లో సరిపడా రక్తం లేనప్పుడు వచ్చే వ్యాధినే రక్తహీనత అంటారు.
శరీరంలో ఐరన్ లోపించడంతో పాటు ఇతర కారణాల వల్ల కూడా చాలా మంది రక్తహీనత బారిన పడుతున్నారు.కారణం ఏదైనా దీనిని నిర్లక్ష్యం చేస్తూ సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలే ప్రమాదంలో పడతాయి.
అందుకే రక్తహీనతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ పొడి ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి నిమిషం పాటు వేయించాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు మినుములు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి.చివరగా ఇందులో అర కప్పు నల్ల నువ్వులు కూడా వేసి మళ్లీ వేయించుకుని.
చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి చల్లారబెట్టుకున్న సగ్గుబియ్యం, నల్ల నువ్వులు, మినుములు వేసి మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
ఇక ఈ పొడిని ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ ను పోయాలి.పాలు కాస్త మరిగిన వెంటనే తయారు చేసి పెట్టుకున్న పొడిని వన్ టేబుల్ స్పూన్ వేసి ఉండలు కట్టకుండా స్పూన్‌తో తిప్పుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.అపై అందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి మిక్స్ చేసుకుని సేవించాలి.

ఇలా ప్రతి రోజు చేస్తే గనుక రక్తహీనత సమస్య పరార్ అవ్వడం ఖాయం.అంతేకాదు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గు ముఖం పడతాయి.తీవ్రమైన నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.మరియు మెదడు పని తీరు సైతం మెరుగ్గా మారుతుంది.







