తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుడిగాలి సుధీర్ కు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.
కమెడియన్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా, హీరోగా ఇలా అన్నిరంగాలలో కూడా తనదైన సత్తా చాటుతూ ఎంత మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.ఏదైనా ఈవెంట్ లో కనిపించాడు అంటే చాలు అక్కడ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.
ఎక్స్ ట్రా జబర్దస్త్ లో చాలామంది కేవలం సుడిగాలి సుదీర్ స్కిట్స్ కోసమే చూసే వాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అంతేకాకుండా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఎంత మంది కమెడియన్లు ఉన్నప్పటికీ సుడిగాలి సుదీర్ ఉన్నాడు అంటే ఆ కిక్కే వేరు.
సుధీర్ తనపై ఎంతమంది ఇన్ని రకాలుగా పంచులు వేసిన కూడా ఏమీ అనుకోడు.సుధీర్ క్రేజ్ కీ కాస్త రష్మీ యాడ్ అయితే ఇక రచ్చ రచ్చే అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా అందులో స్కిట్ లో భాగంగా సుధీర్ నటనలో జీవించేసాడు.స్కిట్ లో భాగంగా సుధీర్ ఒక పద్ధతి గల ఫ్యామిలీ వ్యక్తి పాత్రలో నటిస్తూఉంటాడు.
ఇక సుధీర్ పై లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ కన్ను పడటంతో కత్తిలా ఉన్నావు ఒక్కసారి కూడా చేస్తే పోలా అంటూ పక్కనే ఉన్న వ్యాన్ లోకి తీసుకెళ్లి రేప్ చేసి పిప్పి పిప్పి చేస్తుంది.
ఇక అప్పుడు సుదీర్ ఒక రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇస్తూ చినిగిపోయిన బట్టలతో బాధపడుతూ ఉంటాడు.తర్వాత శాంతి స్వరూప్ చెరుకు పిప్పి ని దీనిపై కి విసురుతాడు.అది చూసిన రష్మి సుదీర్ యు పిప్పి పిప్పి అనడంతో ఆ డైలాగ్ హైలెట్ అవుతుంది.
అప్పుడు సుధీర్ అమాయక మైన యువకుడు శీలం పోగొట్టుకుంటే ఏ విధంగా అయితే నటిస్తాడు అలా అమాయకంగా నటిస్తూ జీవించే చేశాడు.సుధీర్ స్కిట్ చేస్తున్నంతసేపు సుధీర్ పర్ఫామెన్స్ ని చూసి రష్మీ తెగ ఎంజాయ్ చేసింది.
అప్పుడు సుధీర్ ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న బస్టాండ్ లో నిలబడితే ఎవరో అమ్మాయి వచ్చి నన్ను లాక్కొని వెళ్లి నా శీలం దోచుకుంది అని అంటాడు.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.