టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా నేడు థియేటర్లలో విడుదల కానున్న విషయం.ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం విదితమే.
అయితే చిరంజీవి నుంచి సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఎట్టకేలకు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆచార్య సినిమా నేడు థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ దర్శకుడు కొరటాల శివ, రామ్ చరణ్, ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో చిరంజీవి మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ బయటకు వచ్చి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
ఇక పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య స్పెషల్ షో లో ప్లాన్ చేశారట.మెగా ఫ్యామిలీ కోసం ఒక థియేటర్ మొత్తం బుక్ చేశామని, మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ఆ థియేటర్ లోనే ఆచార్య సినిమాను చూడబోతున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే మెగా ఫ్యామిలీ తో కలిసి పవన్ కళ్యాణ్ ఏ థియేటర్లో సినిమాను చూడబోతున్నారు అన్నది మాత్రం రివిల్ చేయలేదు.కానీ మహేష్ AMB మాల్ లో ఆచార్య సినిమా ని మెగా ఫ్యామిలీ వీక్షించబోతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిరు, రామ్ చరణ్ సినిమా గురించి మరింత గొప్పగా చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.







