2019 సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన మొదలైన ఆచార్య సినిమా షూటింగ్ మొదలైన రెండు సంవత్సరాల ఆరు నెలల తర్వాత థియేటర్లలో విడుదల కానుంది.కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో పాటు గతేడాది ఏప్రిల్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తైనా సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.రెమ్యునరేషన్లు కాకుండా ఈ సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలు అని సమాచారం.
ఈ బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు ఏకంగా వడ్డీల భారమే అని తెలుస్తోంది.ఒక విధంగా చిరంజీవి మార్కెట్ ను డిసైడ్ చేసే సినిమా ఆచార్య మాత్రమేననే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆచార్య సినిమాకు నిరంజన్ రెడ్డి మాత్రమే నిర్మాత అని ఆయన నాలుగన్నర కోట్ల రూపాయల లాభం తీసుకుని ఈ ప్రాజెక్ట్ భారాన్ని కొరటాల శివకే అప్పగించారని తెలుస్తోంది. చిరంజీవి, చరణ్, కొరటాల శివ ఈ సినిమాకు రెమ్యునరేషన్లు తీసుకోలేదు.

బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల లాభం రాగా చిరంజీవి, చరణ్ ల రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయలను కొరటాల శివ ఇవ్వాల్సి ఉంది.మరోవైపు ఆచార్య సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది.అన్ని ప్రముఖ థియేటర్లలో ఆచార్య టికెట్లు అందుబాటులో ఉండటం గమనార్హం.కొరటాలకు ఈ సినిమాకు రెమ్యునరేషన్ లేకపోగా మిగిలేదేమీ లేదని తెలుస్తోంది.
ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో కొరటాల శివ టెన్షన్ గా కనిపించడానికి కారణం ఇదేనని బోగట్టా.ఆచార్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయితే మాత్రమే కొరటాల శివకు బెనిఫిట్ కలుగుతుందని సమాచారం అందుతోంది.
ఆచార్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో 36 గంటలు ఆగాల్సిందే.