ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇప్పటినుంచే ప్రజల్లో ప్రచారానికి వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే త్వరలో జిల్లాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొనడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన.
మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలూ ఇంటింట ప్రచారంపై దృష్టి సారించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం భావిస్తున్నారు.ఈ క్రమంలోనే త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
గత ఎన్నికల సందర్భంగా జగన్ ప్రకటించిన నవరత్నాల అమలు మాటెలా ఉన్నా.ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వడ్డిస్తోందని ప్రజలు రగిలిపోతున్నారు.
అంతేగాక.మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ఆశించిన రాజకీయ ప్రయోజనం కలుగలేదు.
పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో దీనిని అధిగమించేందుకు రానున్న రెండేళ్లూ జనంలోకి వెళ్లాలని.జిల్లాల పర్యటన చేపట్టాలని నిర్ణయించారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ రెండేళ్లు ముందుగానే గుంటూరులో పార్టీ ప్లీనరీని నిర్వహించారు.ఆ వెంటనే జగన్ పాదయాత్ర చేపట్టారు.ఇప్పుడు కూడా రెండేళ్ల ముందే జిల్లాల పర్యటన పేరిట.ముందస్తు ఎన్నికల ప్రచారం చేపట్టే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కాగా.నవరత్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో, పార్టీ శాసనసభాపక్ష భేటీలో జగన్ నిర్దేశించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులూ ఉగాది నుంచి పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని జగన్ ఆదేశించారు.ఈ ప్రచారంలో వలంటీర్లను కలుపుకొని వెళ్లాలని తెలిపారు.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే ఎవరినైనా పక్కకు నెట్టేస్తానని.గెలిచేవారికే టికెట్లు ఇస్తానని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.ఇది మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగించింది.ఈ నెల 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయినవారు, ఆశించినవారు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు.
వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు దక్కుతాయో లేదో తేల్చుకున్నాకే జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.







