ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సుమంత్ 'అహం రీబూట్' ఫస్ట్ లుక్

సుమంత్ హీరోగా న‌టిస్తున్న అహాం రీబూట్ ఫ‌స్ట్ లుక్ ని దేశం గ‌ర్వంచ‌ద‌గ్గ ర‌చ‌యిత విజయంద్ర ప్ర‌సాద్ గారు లాంఛ్ చేసారు.ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలోరఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.

 Sumanth Movie Aham Reboot First Look Launch Details, Hero Sumanth, Aham Reboot M-TeluguStop.com

ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు.

ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి.హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్…సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఈ సంద‌ర్బంగా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ.

ఈ కాన్సెప్ట్ విన‌గానే చాలా ఎగ్జైట్ అయ్యాను.చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.

ఇలాంటి క‌థ‌ల‌కు ఇప్పుడు డిమాండ్ మ‌రింత పెరిగింది.సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో న‌టిస్తున్న సుమంత్ కి అభినంద‌న‌లు.

నిర్మాతలు ర‌ఘువీర్, సృజ‌న్ య‌ర‌బోలు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగ‌ర్ కు ఇత‌ర టెక్నీష‌న్స్ కు ఆల్ ద బెస్ట్ అన్నారు.

Telugu Aham Reboot, Prasanthsagar, Sumanth, Raghuvir Gorihi-Movie

ద‌ర్శ‌కుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.అహాం రీ బూట్ తో ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియన్స్ ల‌ను అందించ‌బోతున్నాము.అనుకోని సంఘ‌ట‌ల‌ను మ‌నిషిలోని కొత్త కోణాల‌ను, శ‌క్తుల‌కు బ‌య‌ట‌కు తెస్తాయి.

అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.అలాంటి క‌థే అహాం రిబూట్.

సుమంత్ న‌ట‌న చాలా హైలెట్ గా ఉంటుంది.ద‌ర్శ‌కునిగా ఈ క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జైట్ మెంట్ లో మా టీం ఉంది.

అన్నారు.

Telugu Aham Reboot, Prasanthsagar, Sumanth, Raghuvir Gorihi-Movie

నిర్మాత ర‌ఘువీర్ గోరిప‌ర్తి మాట్లాడుతూ.మా సినిమా ఫ‌స్ట్ లుక ని లాంఛ్ చేసిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ గారి కృత‌జ్ఞ‌త‌లు.మా కాన్సెప్ట్ ని ఆయ‌న‌కు ఆసక్తి గా అనిపించ‌డం చాలా సంతోషంగా అనిపించింది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.జూన్ మొద‌టివారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం.

ఈ సినిమా మా బ్యాన‌ర్ కి ఇమేజ్ ని తెస్తుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.

సంగీతం – శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ – వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్ సూపర్ విజన్ – సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్ – ఏఆర్ వంశీ, సౌండ్ – నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతలు – రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు, రచన దర్శకత్వం – ప్రశాంత్ సాగర్ అట్లూరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube