సుమ కనకాల 'జయమ్మ పంచాయితీ' నుండి 'గొలుసుకట్టు ఘోషలు' పాట లిరికల్ వీడియో విడుదల

పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివలే గ్రాండ్ గా రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

 Suma Kanakala Jayamma Panchayathi Golasukattu Ghosalu Lyrical Video Out Details,-TeluguStop.com

‘జయమ్మ పంచాయితీ’ మ్యూజికల్ ప్రమోషన్లలో భాగంగా చిత్రం యూనిట్ ‘గొలుసుకట్టు ఘోషలు’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది.మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ పాటని హృదయాన్ని కదిలించేలా కంపోజ్ చేశారు.వినగానే భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా వుందీ పాట.చారు హరిహరన్, కీరవాణి ఈ పాటను హృదయాన్ని తాకేలా ఆలపించగా, చైతన్య ప్రసాద్ అర్ధవంతమైన సాహిత్యం అందించారు.కథలో కీలకమైన సందర్భంలో ఈ పాట ఉండబోతుందని సాహిత్యం వింటే అర్ధమౌతుంది.

జయమ్మ పాత్రకు ఎదురయ్యే కష్టాన్ని, ఆ పాత్రలోని ఎమోషనల్ కోణాన్ని ఈ పాట ఆవిష్కరించింది.

దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ‘జయమ్మ పంచాయతీ’ ని విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి అనూష్ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు.

వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది.

తారాగణం:

సుమ కనకాల.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు, సంగీతం: ఎంఎం కీరవాణి, డీవోపీ: అనూష్ కుమార్, ఎడిటర్: రవితేజ గిరిజాల, నిర్మాత: బలగ ప్రకాష్, సమర్పణ: శ్రీమతి విజయ లక్ష్మి, బ్యానర్: వెన్నెల క్రియేషన్స్, ఆర్ట్: ధను అంధ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అమర్ – అఖిల, పబ్లిసిటీ డిజైన్స్: అనంత్ కంచెర్ల, కాస్ట్యూమ్స్: హరి ప్రియ, పీఆర్వో: వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube