జలంధర్‌లో ఓ ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీకి పాల్పడి లక్షలాది రూపాయల నగదు, బంగారు అపహరించుకుపోయారు దొంగలు.అంతేకాదు.
దొంగతనానికి అడ్డొచ్చిన ప్రవాస భారతీయుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య వున్నాడు.
తాజాగా పంజాబ్‌లోనే మరో దారుణం జరిగింది.తరన్ తారన్ జిల్లాలో ఓ ఎన్ఆర్ఐ యువకుడిని దుండగులు కాల్చి చంపారు.
వివరాల్లోకి వెళితే.శనివారం అర్థరాత్రి చుంక్ చార్ ఖంబా వద్ద సోవాహకి చెందిన ప్రవాస భారతీయుడిపై మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండుగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆయన ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు.మృతుడిని జతీందర్‌పాల్ సింగ్ (25)గా గుర్తించారు.ఆయన ఏప్రిల్ 16న కెనడా నుంచి వచ్చారు.మృతుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి తరన్ తారన్ నుంచి స్కార్పియోలో ఇంటికి వెళ్తుండగా… దుండగులు ఎస్‌యూవీపై కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చొన్న జతీందర్ పక్కటెముకలోంచి బుల్లెట్ దూసుకుపోయింది.దీంతో స్నేహితులు ఆయనను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.
జతీందర్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.ఆదివారం స్థానిక సివిల్ ఆసుపత్రిలో అతని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
దుండగులపై ఐపీసీ సెక్షన్ 302, 34, ఆయుధాల చట్టంలోని 24, 54, 59 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే జతీందర్ పాల్ అతని స్నేహితుల కాల్ డేటా ప్రకారం.
ఈ హత్య వెనుక ఓ మహిళ వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.వారు ఇంటి నుంచి బయలుదేరే ముందు స్థానిక పంజ్ తారా రెస్టారెంట్‌లో కాక్‌టెయిల్ పార్టీలో పాల్గొన్నట్లు చెప్పారు.
అప్పుడు అనుమానిత మహిళకు కూడా ఫోన్ చేశారని.కానీ ఆమె రాలేదని పోలీసులు తెలిపారు.
వారి ప్రతి కదలికకు సంబంధించిన సమాచారం ఆమె వద్ద వుందని.జతీందర్ పాల్‌ను హత్య చేసేందుకు బైక్‌ను పంపింది కూడా ఆ మహిళేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి సమీపంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.







