ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ నిర్ణయించిన మంత్రి పదవులపై మాజీ మంత్రుల ఇంకా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఎవరి చేప్పుకోలేని పరిస్ధితి నేతల్లో ఉంది.
అయితే మంత్రి పదవిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రి పదవి తనకు వెంట్రుక ముక్కతో సమానమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి పోయినప్పుడు బాధ పడలేదని కానీ ఎమ్మెల్యే పదవిపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతానని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.అంతేకాదు మాజీ మంత్రి అని తనను పిలవవద్దని కార్యకర్తలకు, సూచించారు.
మంత్రి పదవిలో ఉండేదాని కంటే గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే ఇష్టమని చెప్పుకొచ్చారు.
కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎంపీ నందిగం సురేశ్‌తో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారని తాను అలాంటి వ్యక్తిని కాదని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి తనదైన శైలిలో ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు.చంద్రబాబు నాయుడు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందంటూ టీడీపీ చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు.420 గ్యాంగ్, చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు ఈ విష ప్రచారం చేస్తున్నారని.వాటిని పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలయ్యేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్ఆర్‌ను కోల్పోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలై సర్వనాశనం అయ్యిందని కొడాలి నాని ఆవేదన చెందారు.బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఊపిరున్నంతకాలం ప్రజా ప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయడమే తన ముఖ్య లక్ష్యమని చెప్పుకొచ్చారు.మంత్రివర్గ విస్తరణలో కొడాలి నాని మంత్రి పదవి పోగొట్టుకున్నారు.అనంతరం సీఎం జగన్ కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా కేబినెట్ హోదా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వయసు అయిపోయిందని అందువల్లే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విమర్శించారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెల్ల మెుఖం వేసుకుని రాష్ట్రంలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓర్చుకోలేక రాష్ట్రంలో తిరుగుతూ విష ప్రచారం చేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు.







