నిత్యా మీనన్ కు హీరో విశ్వక్ సేన్ బిస్కెట్స్.. అలా బుక్ అయిపోయాడుగా!

బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.శ్రీ రామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అలాగే హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 Vishwak Sen Funny Conversation With Nithya Menon Vishwak Sen, Nithya Menon, Toll-TeluguStop.com

షో లో ఒక్కొక్క వారం ఒక స్పెషల్ థీమ్ ఉంటుంది.ఇందులో భాగంగానే గత వారం ఎస్పీబీ పాటలు తీసుకున్నారు.

ఈ వారం రెట్రో స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ వారం స్పెషల్ గెస్ట్ గా హీరో విశ్వక్ సేన్ హాజరయ్యాడు.

రెట్రో థీమ్ అనుగుణంగానే కంటెస్టెంట్ లు కూడా పాతకాలంనాటి కాస్ట్యూమ్ ధరించారు.షోలో విశ్వక్ సేన్ సింగర్ లాలసతో కలిసి మాస్ స్టెప్పులను ఇరగదీశాడు.అనంతరం జడ్జిలను తన డాన్స్ కీ జడ్జిమెంట్ కూడా ఇవ్వమని కోరాడు.అప్పుడు తమన్ పైకి లేచి క్లాప్స్ కొట్టడంతో విశ్వక్సేన్ మోకాళ్లపై పడి అభివాదం చేశాడు.

ఆ తరువాత కాసేపు విశ్వక్‌ సేన్‌ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు.తర్వాత న్యాయనిర్ణేతగా ఉన్న నిత్యామీనన్ తో మాట్లాడుతూ నిత్యామేనన్‌ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అలా వైకుంఠపురంలో నుంచి మొన్నటి భీమ్లానాయక్‌ వరకు అంటూ మాట్లాడుతుండగా నిత్యా కలగజేసుకుని అది అలా మొదలైంది అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్‌ సేన్ కు గాలి తీసినట్లైంది.

Telugu Nithya Menon, Sirngersri, Thaman, Tollywood, Vishwak Sen-Movie

ఇక వెంటనే విశ్వక్ సేన్ ఇప్పుడు నన్ను ఏసుకుంటారు కదా అని శ్రీరామచంద్రను అడుగుతాడు.అలా మొదలైంది.అలా వైకుఠంపురంలో అలా ఉందికదా, అలా కన్ఫ్యూస్ అయ్యాను అని చెబుతూ విశ్వక్ సేన్ కవర్‌ చేసుకున్నాడు.విశ్వక్ సేన్ సినిమాల విషయానికి వస్తే.తన అశోకవనంలో అర్జన కల్యాణం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశాడు.అంతే కాకుండా ఇప్పటి వరకు చేసిన మాస్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది అని తెలిపాడు.

ఈ సినిమా మంచి అరిటాకు భోజనంలా ఉంటుంది అని ఈ సినిమామి సకుటుంబ సపరివారి సమేతంగా వెళ్లి చూడచ్చని హామీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube