డచ్ విమానయాన సంస్థ కేఎల్ఎం భారతీయ ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది.యూకేకు వచ్చే భారతీయ ప్రయాణీకులు తమ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణీంచినట్లయితే షెంగెన్ వీసా అవసరం లేదని పేర్కొంది.
అయితే ఇది కేఎల్ఎం ఎయిర్‌లైన్స్‌కి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.తమ భాగస్వామ్య సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ ద్వారా ప్రయాణించే వారికి మాత్రం ఎలాంటి మినహాయింపులు వుండవని వెల్లడించింది.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాల్సిన భారతీయ పౌరులు.ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని షిపోల్ విమానాశ్రయం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు షెంగెన్ వీసా అవసరం లేదని కేఎల్ఎం పేర్కొంది.అట్టి ప్రయాణీకులు యూకేకు చెల్లుబాటు అయ్యే వీసాను కలిగి వుంటే చాలని వెల్లడించింది.అలాగే వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించి ఎంట్రీ పరిమితులకు అర్హత పొంది వుండాలని తెలిపింది.
ప్రయాణ పరిస్ధితులకు సంబంధించిన వివరాల కోసం klm.traveldoc.aeroను సంప్రదించాలని కోరింది.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) తర్వాత ఈయూ యేతర పౌరులు ట్రాన్సిట్ ఫ్లైట్‌ల ద్వారా యూకేకు వెళ్లాలంటే తప్పనిసరిగా ట్రాన్సిట్ షెంగెన్ వీసాను కలిగి వుండాలని ఈయూ స్పష్టం చేసింది.అయితే ఈయూలో భాగం కానీ స్విట్జర్లాండ్‌కు దీని నుంచి మినహాయింపు వుంది.ఇదే సమయంలో ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్, ప్యారిస్‌లలోని హబ్‌ల నుంచి ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా వంటి క్యారియర్లలో యూకేకు వెళ్లేందుకు భారత సంతతి ప్రయాణీకులను అనుమతించడం లేదు.
వీరు భారత సంతతికి చెందిన వారు కావడం.ట్రాన్సిట్ షెంగెన్ వీసా లేకపోవడమే ఇందుకు కారణం.
ఈయూ యేతర ప్రయాణీకులను ట్రాన్సిట్ షెంగెన్ వీసా పేరిట వేధిస్తోన్న యూకేకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఈయూ నిర్ణయించిందని.కొందరు ఎయిర్‌లైన్స్ అధికారులు అంటున్నారు.
అయితే ఈయూలో సభ్యదేశం కానీ స్విట్జర్లాండ్.తమ దేశానికి చెందిన ఎయిర్‌లైన్స్ స్విస్ కోసం షెంగెన్ వీసా నియమాన్ని తప్పించింది.
భారత్ నుంచి యూకేకి ఎయిర్‌లైన్స్ స్విస్ వన్ స్టాప్ విమానాల్లో వెళ్లే ప్రయాణీకులు ట్రాన్సిట్ షెంగెన్ వీసా లేకుండా స్విట్జర్లాండ్ నుంచి ప్రయాణించవచ్చని తెలిపింది.ఎయిర్ ఇండియా, విస్తారా, బ్రిటీష్ ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్ నాన్‌స్టాప్ సర్వీసులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.







