ఇటీవలే మంత్రి వర్గ విస్తరణను జగన్ చేపట్టారు.ఆ మార్పు చేర్పుల్లో ఎంతోమంది జగన్ కు సన్నిహితులైన వారు తమ పదవులను కోల్పోయారు.
వారిలో ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడు గానూ, పార్టీ వీర విధేయుడు గాను ముద్రపడిన కొడాలి నాని సైతం మంత్రి పదవిని కోల్పోయారు.ఇక అప్పటి నుంచి నాని అందుబాటులో లేరు.
కనీసం నియోజకవర్గంకి కూడా వెళ్లకపోవడం , హైదరాబాదులోనే ఉండిపోవడంతో రాజకీయంగా అనేక అనుమానాలు మొదలయ్యాయి. అసలు నాని ఎందుకు సైలెంట్ అయ్యారు ? మంత్రి పదవి కోల్పోవటంతో అసంతృప్తికి గురయ్యారా ? అందుకే నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టడం లేదా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.దాదాపు 20 రోజులుగా కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెట్టక పోవడంతో , దానికి గల కారణాలపై ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు.ఏప్రిల్ 1 నుంచి గుడివాడ జనాలకు నాని దర్శనం కరువైంది.
ఆయన కుటుంబం అంతా హైదరాబాద్ లోనే మకాం ఉండడంతో, నాని కూడా అక్కడే ఉండిపోయారట.

ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాని ఈసారి మాత్రం 20 రోజులకు పైగానే నియోజకవర్గానికి దూరంగా ఉండడం, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసినా. నాని మాత్రం హైదరాబాద్ కి పరిమితం అయిపోవడం వంటివి ఆసక్తి రేపుతున్ తనకు మంత్రి పదవి ఉన్నా , లేకపోయినా ఫర్వాలేదని, అసలు మంత్రి పదవి లేకపోతే టిడిపి అధినేత చంద్రబాబును మరింతగా తిట్టేందుకు తనకు అవకాశం ఏర్పడుతుందని మంత్రి పదవి తనకు అడ్డంగా మారిందంటూ ఇటీవలే కొడాలి నాని అభిప్రాయపడ్డారు.కానీ కొత్త మంత్రివర్గ విస్తరణ లో నాని పదవి కోల్పోయినా, అంతకు ముందు నుంచే సైలెంట్ అయిపోవడం తో దాని వెనుక కారణాలు ఏమిటనేది అంతుపట్టని విషయంగా మారింది.







