వారెవ్వా.. ఎత్తరజెండా పాటను అద్భుతంగా రీక్రియేట్ చేసిన జపనీయులు.. వీడియో వైరల్!

ఆర్​ఆర్​ఆర్ సినిమాలోని ‘ఎత్తరజెండా’ పాట ప్రజలను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ పాట మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలా మందిని ఉర్రూతలూగిస్తోంది.

 The Japanese Who Wonderfully Recreated The Attara Janda Song From Rrr Song Rr-TeluguStop.com

ఈ పాటకు విదేశీయులు కవర్ సాంగ్స్ కూడా వేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు జపాన్​ యూట్యూబర్లు ఎత్తరజెండా పాటను అద్భుతంగా రీక్రియేట్ చేశారు.

అంటే ఏంటంటే వీరు ఒరిజినల్ పాటలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, ఆలియా చేసిన డ్యాన్స్​ను​ అచ్చు గుద్దినట్టుగా దించేశారు.దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేయగా ఇది విపరీతంగా వైరల్ అవుతుంది.

హిరోమునియేర్‌, అసహి ససాకి అనే ఇద్దరు జపనీయులు బాగా పాపులర్ అయిన పాటలకు డ్యాన్సులు చేస్తూ చిన్నపాటి సెలబ్రిటీ స్టేటస్ దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సోదరులు ‘ఆర్​ఆర్​ఆర్​’ లోని ఎత్తర జెండా పాటకు కాలు కదిపారు.చెర్రీ, తారక్, అలియా ప్రతి ఫ్రేమ్‌లో ఏయే డ్రెస్సులు ధరించారో అలాంటి వాటినే వీరు తొడుక్కున్నారు.

అంతేకాదు, ఒరిజినల్ పాటలో కనిపించిన డ్యాన్స్ స్టెప్ లను అచ్చు గుద్దినట్టు దింపేశారు.

ఇంకో విశేషం ఏంటంటే, వీరు ఒరిజినల్‌ వీడియోలో కనిపించిన అన్ని వస్తువులను తమ వీడియోలో కనిపించే లాగా ప్లాన్ చేశారు.తమకున్నంత బడ్జెట్‌లోనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలు పెట్టి ఒరిజినల్ వీడియోని తలపించాయి. వీరి క్రియేటివిటీ, డాన్సింగ్ స్కిల్స్ పై నెటిజన్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.

ఈ జపాన్ ఫ్యాన్ వెర్షన్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube