యాదాద్రి జిల్లా:ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో మంత్రి కేటీఆర్ పిచ్చిగా వాగుతున్నాడని,దేశ ప్రధానిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే మంత్రి కేటీఆర్ బీజేపీపైన,ప్రధాని మోదీపైన అసభ్య పదజాలంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడడం తట్టుకోలేకనే మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై అక్కసు వెల్లగక్కుతున్నారని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని,మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తూ లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు.
సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన ఆర్ధికదోపిడిపై ప్రధాని మోదీ ఉక్కుపాదం మోపుతారని,త్వరలోనే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమని అన్నారు.ఇప్పటికైనా కేటీఆర్ తన పద్దతి మార్చుకొని వెంటనే ప్రధాని మోదికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో దూడల భిక్షం గౌడ్,రమణగోని శంకర్,గుజ్జుల సురేందర్ రెడ్డి,రిక్కల సుధాకర్ రెడ్డి,బండమీది మల్లేష్,పాలకూర జంగయ్య గౌడ్,బత్తుల జంగయ్య గౌడ్,ఉబ్బు భిక్షపతి, కైరంకొండ అశోక్,సప్పిడి లింగారెడ్డి,పర్నే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.