సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్.. నార్త్ హీరోలు పాన్ మసాలా స్టార్స్.. పరువు పోతుందంటూ?

గత కొన్నేళ్లలో భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని భాషల్లో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది.బాహుబలి, బాహుబలి2, కేజీఎఫ్, కేజీఎఫ్2, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి.

 Meme Goes Viral About South Heroes And North Heroes Details Here , North Heroes,-TeluguStop.com

సౌత్ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్లను చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి.భారీ బడ్జెట్ తో, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ తో సౌత్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

సౌత్ హీరోలు కేవలం ఒకటి రెండు సినిమాలతోనే పాన్ ఇండియా హీరోలుగా ఇమేజ్ ను పెంచుకుంటూ సత్తా చాటుతున్నారు.సౌత్ హీరోల సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు ఆయా హీరోల పారితోషికం కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అయితే ప్రస్తుతం నెట్టింట ఒక మీమ్ తెగ వైరల్ అవుతోంది.ఆ మీమ్ లో సౌత్ హీరోలు పాన్ ఇండియా హీరోలు అయితే నార్త్ హీరోలు పాన్ మసాలా స్టార్స్ అని పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోలు డబ్బుల కోసం పాన్ మసాలా యాడ్లలో నటించడం గురించి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పాన్ మసాలా యాడ్ కు అక్షయ్ కుమార్ ఓకే చెప్పగా విమర్శలు రావడంతో ఆయన ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్ సైతం ఈ తరహా యాడ్స్ లో నటించడం గమనార్హం.

Telugu Ajay Devgan, Bahubali, Kgf, Heroes, Shahrukh Khan-Movie

స్టార్ హీరోలు నటిస్తున్న యాడ్స్ అభిమానులపై ఎంతగానో ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉంటాయి.కొన్నిరోజుల క్రితం బన్నీకి ఇలాంటి యాడ్ లో నటించే ఆఫర్ రాగా బన్నీ ఆ ఆఫర్ కు నో చెప్పారు.పాన్ మసాలా యాడ్స్ విషయంలో సౌత్ హీరోలను చూసి నార్త్ హీరోలు నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube