సాధారణంగా వధూవరులు పెళ్లి మంటపానికి కాస్ట్లీ కార్లలో వస్తుంటారు.ఇక మరీ ధనవంతులు అయితే హెలికాఫ్టర్ లో కూడా రావడం మనం చూస్తుంటాం.
కానీ అందుకు భిన్నంగా ఓ వరుడు పెళ్లి మంటపానికి ఏకంగా ఎద్దుల బండిలో వచ్చి.అందరిని ఆశ్చర్యపరిచాడు.అది చూసి వివాహానికి వచ్చిన బంధువులు అంతా అవాక్కయ్యారు.అతను పైగా ఒక డాక్టర్.అతను తలుచుకుంటే తన పెళ్లి కోసం ఎంతో ఖర్చుపెట్టగలడు.కానీ అలా చేయలేదు.
వివాహం అనంతరం పెళ్లి కూతురిని కూడా అదే ఎడ్ల బండిపై తీసుకెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే.
మధ్య ప్రదేశ్ రాష్ట్రాలోని బెతూల్ పట్టణానికి చెందిన డాక్టర్ రాజా ఘుర్వే అనే యువకుడు ఇటీవల వివాహం చేసుకున్నాడు.అతను వృత్తి రీత్యా డాక్టర్.
అంతేకాదు అతను మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా.ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం మానవాళికి ముప్పులా తయారయింది.
దానిని అరికట్టాలంటూ ప్రచారాలు చేసాడు.అంతేకాదు.
డబ్బు విలువను మరిచి అందరూ దుబారా ఖర్చు చేస్తున్నారని.అలా చేయకూడదంటూ సైతం ప్రచారాలు కూడా చేశాడు.
ఇటీవల డాక్టర్ ఘుర్వే బేతుల్ వివాహం చేసుకున్నాడు.అయితే వివాహానికి అతను అందంగా అలంకరించిన ఎద్దుల బండిలో వెళ్లాడు.వివాహం జరిగాక వధువుని వరుడు ఆ ఎద్దుల బండిలోనే తన ఇంటికి తీసుకెళ్లాడు.తను అలా ఎద్దుల బండిలో రావడానికి గల కారణాలను రాజా ఘుర్వే వివరించాడు.
ఒకప్పుడు పెళ్ళికి ఎద్దుల బండిలోనే వచ్చేవారని.అది మన గ్రామీణ సంస్కృతిలో భాగమని.
పైగా అది కాలుష్య రహితమని చెప్పాడు.పెట్రల్, డీజిల్ ధరలు పెరిగి జనజీవనంపై భారం కావడంతో వాటి ఉపయోగాన్ని తగ్గించాలని కూడా సూచించాడు.
దీన్ని చూసిన పలువురు ఆ డాక్టర్ ని మెచ్చుకుంటున్నారు.








