సికింద్రాబాద్ నుండి బేగంపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిని నలభై ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్యాట్ని నాలా అభివృద్ధి పనుల కారణంగా బేగంపేట ప్రధాన రహదారి మూసి వేసినట్లు పేర్కొన్నారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశామని వారంతా ఇతర మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని సూచించారు.నాలా పనులు 45 రోజుల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వైపు వాహనాలు వెళ్లేందుకు రహదారికి ఒకవైపు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.అమీర్పేట పంజాగుట్ట హైటెక్ సిటీ వైపు వెళ్లే వారు కిమ్స్ రహదారి నుండి వెళ్లేందుకు ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు.







