కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ 2 సినిమా ఇటీవల విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కేజిఎఫ్ 2 సినిమా మేనియానే కనిపిస్తోంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు దర్శకుడి పై, అదే విధంగా హీరో యష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అది అంచనాల నడుమ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమాలో హీరో యష్,యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
మరీ ముఖ్యంగా ఈ సినిమాలో యష్ చెప్పిన ఒక డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఆ డైలాగ్ కు ట్రైలర్ విడుదలైనప్పటినుంచే విపరీతమైన క్రేజ్ పెరిగింది.సినిమాకో వయలెన్స్.వయలెన్స్.
వయలెన్స్. ఐ డోంట్ లైక్ ఇట్ అంటు చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ డైలాగ్‌తో అనేక మీమ్స్, రీల్స్ వచ్చి ఎంతో అలరించాయి.అంతేకాకుండా ఇదే డైలాగ్ ని పలువురు సెలబ్రిటీలు చెబుతూ సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలను కూడా షేర్ చేశారు.
అయితే ఇదే డైలాగ్ ని ఫాలో అవుతూ ఒక వ్యక్తి ఏకంగా పెళ్లి కార్డులు ప్రింటింగ్ వేయించాడు.

వెడ్డింగ్ కార్డ్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి పెళ్లి శుభలేఖపై మ్యారేజ్.మ్యారేజ్.
మ్యారేజ్.ఐ డోంట్ లైక్ ఇట్.
ఐ అవైడ్.బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్.
ఐ కాంట్ అవైడ్ అనే డైలాగ్ ను ముద్రించాడు.దీంతో ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది చూసిన రాకి భాయ్ అభిమానులు సంబరపడిపోతున్నారు.







