నిజంగా ఇది నమ్మశక్యమేనా..? ప్రపంచ కుబేరుడికి సొంతిల్లు లేదట..!

ఎలన్ మస్క్… ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లదనే చెప్పాలి.ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఎలన్ మస్క్ కూడా ఒకరు.

 Is This Really Believable World ‚richest Has No Property , Elan Mask , Twitter-TeluguStop.com

అంత ఆస్థి ఉన్న ఆయనకు సొంత ఇల్లు లేదంటే ఎవరన్నా నమ్ముతారా.కానీ నిజంగానే ఎలన్ మస్క్ కు సొంత ఇల్లు లేదు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.మొదట పేపాల్ తో మొదలైన ఎలన్ మస్క్ ప్రస్థానం టెస్లాతో ఊహించని రీతిలో టాప్ స్థాయికి చేరింది.

ఆ తరువాత స్పేస్ ఎక్స్ తో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో ఆయన కూడా ఒకరుగా పేరు సంపాదించుకున్నారు.

అలాంటి ఎలన్ మస్క్ కు సొంత ఇల్లు లేకపోవడం ఏంటి అని ప్రజలందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇదే నిజం అని ఎలన్ మస్క్ అంటున్నారు.సొంత ఇళ్లు లేని తాను స్నేహితుల ఇళ్లల్లోనే ఉంటానని తాజాగా టెడ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మోడరేటర్ అండర్సన్ తో చెప్పుకోచ్చాడు.

అలాగే ఆయన గురించిన మరెన్నో ఆసక్తికర విషయాలను ప్రపంచానికి తెలియచేసాడు. టెస్లా ఇంజినీరింగ్ పనులు ఎక్కువగా జరిగే బే ఏరియాకు ఎలన్ తరచుగా వెళ్తుంటానని తెలిపారు.

అలా ఆ ప్రాంతానికి వెళ్లిన సందర్భాల్లో తన ఫస్నేహితుల ఇళ్లలో ఉండే స్పేర్ బెండ్ రూమ్ లలోనే ఉండేవాడినని చెప్పుకొచ్చారు.

Telugu Bay Area, Elan, Anderson, Paypal, Spare Bend, Tesla-Latest News - Telugu

అలాగే ఎలన్ మస్క్ ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెట్టేవారు కాదట. ఖర్చులు కూడా చాలా తక్కువని ఆయన తెలిపారు అలాగే ఇప్పటివరకు ఆయనకు సొంతంగా ఒక్క లగ్జరి యాచ్ కూడా లేదని ఎలన్ మస్క్ వెల్లడించారు.అలాగే తనకంటూ ఏదైనా విలువైనది ఉందంటే అది ఒక్క విమానమేనని ఆయన వివరించారు.

ఆ విమానమే లేకపోతే తాను పనులు చేసుకోవడం కుదరదని, దాని వలనే సమయం కూడా ఆదా అవుతోందని పేర్కొన్నారు.అంత ఆస్థి ఉండి కూడా సింపుల్ లైఫ్ ను లీడ్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా అని నేటిజన్లు ఎలన్ మస్క్ ను పొగుడుతున్నారు.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube