దివంగత దేవినేని బాజీప్రసాద్ గారి పేరిట నిర్మించిన వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల మధ్య దేవినేని చంద్రశేఖర్ (చందూ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.71 సంవత్సరాలు నిండి 72వ సంవస్తారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో 72 సంఖ్య గల 72 kg ల కేక్‌ను పిల్లలతో కలిసి కట్ చేసిన దేవినేని చందు.అక్కడ ఉన్న 250 మంది పిల్లలకు పుస్తకాలతో పాటు స్టేషనరీ పంపిణీ.
పిల్లలందరూ క్రమశిక్షణతో చదువుకుని భావి భారత పౌరులుగా ఉన్నత రంగాల్లో రాణించాలి.సకల వసతులతో పిల్లలు విద్యనభ్యసించాలనే… 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి దేవినేని బాజీప్రసాద్ వీఎంసీ ఎలిమెంటరీ స్కూల్‌ని అభివృద్ది చేశాం.
72వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మన మాజీ ముఖ్యమంత్రి చంద్రాబాబు గారు… తన చిన్నప్పుడు తొమ్మిదో తరగతి వరకు స్కూలుకి వెళ్లడానికి 11 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారు.ఆ పట్టుదల, అంకితభావమే ఇప్పుడు ఆయన్ని ఈ స్థాయి చేర్చింది.రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చడంతో పాటు… హెరిటేజ్ డెయిరీ వ్యవస్థాపకులుగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది హైదరాబాద్‌ను సైబరాబాద్‌గా మార్చిన మన చంద్రబాబుగారిని గెలిపించుకుంటే… మన రాష్ట్రం కూడా బాగుపడి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
చిన్న వయస్సులో చదువు కోసం అష్టకష్టాలు పడి… తెలుగు జాతి గర్వించదగ్గ నేతగా ఎదిగిన చంద్రబాబుగారిని విద్యార్థినీ విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి
.






