వామ్మో ఈ సమోసా రేటు ఎంతో తెలుసా..

మనం రకరకాల టేస్టులతో ఎన్నో ఇష్టపడి తింటుటాం అందులో ఒకటి సమోసా అయితే సమోసా ఎన్నో విధాలుగా మనకు నచ్చనట్లుగా చేసుకుని తింటాం దానిలో ఆడవాళ్లు స్పెషలిస్ట్ లు ఈ సమోసా కథ తెలుసుకునే ముందు.మనం ఓ ఆర్థశాస్త్ర సిద్ధాంతం గురించి చర్చించుకుందాం.ఎందుకంటే… సామాన్యులపై ఎలా దోపిడీ జరుగుతోందో ఆ సిద్ధాంతం వివరిస్తుంది.మన దేశంలో అత్యంత సంపన్నులు ఉన్నారు అత్యంత పేదవారూ ఉన్నారు.

 Do You Know The Rate Of This Samosa , Samosa , Samosa Price , Samosa Story , Sna-TeluguStop.com

సంపన్నులు ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎంత ధర ఉన్నా వారికి అది పెద్దగా భారం కాదు.అదే వస్తువును సామాన్యులు కొనాలంటే వంద లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది.

సమోసా అనేది సామాన్యులు టీ తోపాటూ ఇష్టంగా తినే స్నాక్.దాని ధర పదో, ఇరవయ్యో ఉంటే పర్లేదు గానీ ఏకంగా రూ.170 ఉంటే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది? ఆ సమోసాని సంపన్నులు రూ.170 పెట్టి కొనడం వారికి పెద్ద సమస్య కాదు.కానీ అలా వారు కొంటూ ఉంటే… ఇతర వ్యాపారులు కూడా అదే ధరకు లేదా అంతకంటే కాస్త తక్కువ ధరకు మిగతా ప్రాంతాల్లో అమ్మడం మొదలుపెడతారు.అప్పుడు సామాన్యుడికి సమోసా భారం అవుతుంది.

ఇలా సంపన్నులు అధిక ధరకు వస్తువులు కొంటే… ఆ ప్రభావం పరోక్షంగా సామాన్యులపై పడుతుందనేది ఆర్థశాస్త్ర సిద్ధాంతం.వాస్తవంలో జరుగుతున్నది కూడా అదే.

ఒకప్పుడు పేలాలు రూ.10 లేదా రూ.20 ఉండేవి.ఇప్పుడు మల్టీప్లెక్సుల్లో వాటి ధరను రూ.50 నుంచి రూ.100కి పెంచేయడంతో… బయట కూడా వాటి ధరను పెంచేస్తున్నారు.చివరకు నష్టపోతున్నది సామాన్యులే.ఇలా ధరలను కృత్రిమంగా పెంచడం వల్ల పేదవారు ఇబ్బంది పడుతున్నారు.కానీ దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

Telugu Chromosa, Costa Eater, Delhi Airport, Multiplexes, Popcorn, Priyal User,

ట్విట్టర్ యూజర్ అయిన ప్రియాల్ తన అకౌంట్ లో ఏప్రిల్ 14న సమోసాల ఫొటోను షేర్ చేశారు.ఏంటి? అని క్యాప్షన్ పెట్టారు.ఎందుకంటే… న్యూ క్రమోసా పేరుతో ఆ ఫొటోలో కొన్ని సమోసాలు ఉన్నాయి.ఒక్కో దాని ధర రూ.170గా ఫిక్స్ చేశారు.ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని కోస్టా ఈటరీలో ఇవి అమ్ముతున్నారు.దేశీ సమోసాకి ఆస్ట్రియా స్నాక్ డిజైన్ ఇచ్చి క్రమోసా అని టైటిల్ పెట్టారు.ఈ సమోసా కొన్నవారికి ముంచుకొని తినేందుకు కొద్దిగా పుదీనా చట్నీ ఇస్తారు.మరి దానికే రూ.170 ఎందుకు? అనే ప్రశ్న తలెత్తింది.అందుకే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అసలే ఇండియాలో పెట్రోల్, డీజిల్ సహా చాలా నిత్యవసర, అత్యవసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి.మందుల ధరలు కూడా పెరిగాయి.నిమ్మకాయలు కూడా కొనలేని రోజులొచ్చాయి.ఈ విపరీత ద్రవ్యోల్బణం ఎందుకు? కారణాలేంటి అనేది ప్రభుత్వాలు పరిశీలించాలి.ధరలను తగ్గించేందుకు ప్రయత్నించాలి.లేదా ప్రజల ఆదాయం పెరిగేలా చెయ్యగలగాలి.ఈ రెండూ జరగట్లేదు. సామాన్య, మధ్యతరగతి వారు నలిగిపోతున్నారు.

Telugu Chromosa, Costa Eater, Delhi Airport, Multiplexes, Popcorn, Priyal User,

దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీన్ని మనం వెజ్ పఫ్ అని పిలుస్తాని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా ఓ నేరాన్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నానుని మరో యూజర్ స్పందించారు.భారతీయులు దీన్ని అడ్డుకోవాలని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.“రూపాయిలను డాలర్లలోకి మార్చడం అంటే ఇదని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube