బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
ఇకపోతే ఈమె అప్పుడప్పుడు ఇండస్ట్రీలో గురించి, సినిమాల గురించి ఇలా ఏదో ఒక విషయం మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఇక ఇటీవలే విడుదల అయిన కేజిఎఫ్ 2 సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
కేజిఎఫ్ సినిమాలో హీరో యష్ పాత్ర తర్వాత గుర్తింపు తెచ్చుకుంది ఈమెనే.
అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవీనాటాండన్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.సక్సెస్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన రవీనాటాండన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడం తో పాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.అంతేకాకుండా మన సౌత్ సినిమాల రేంజ్ లో వందల కోట్ల బడ్జెట్ ను రాబడుతున్నాయి అని తెలిపింది.

దక్షిణాది సినిమాలు ఇండియన్ కల్చర్ కు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే, బాలీవుడ్ సినిమాలు మాత్రం హాలీవుడ్ ను ఫాలో అవుతూ మాస్ ఆడియన్స్ కు దూరం అవుతున్నాయి అంటూ ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేకాకుండా అప్పట్లో పాశ్చాత్య దేశాల సంస్కృతికి దగ్గరగా ఉండే విధంగా మెలోడీస్, మ్యూజికల్ సినిమాలు వచ్చాయని, అవి హాలీవుడ్ సినిమాలకు దగ్గరగా ఉండేవని, కానీ క్రమంగా ఇండియన్ కల్చర్ తగ్గుతూ వచ్చిందని, ఆ సమయంలో తాను కూడా కొన్ని దక్షిణాది సినిమాల్లో నటించాను అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా ఉండే సినిమాలు బాలీవుడ్ లో తగ్గడంతో మాస్ ఆడియన్స్ హిందీ సినిమాలకు దూరం అయ్యాడు అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం రవీనాటాండన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







