నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ.నాని కెరియర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే జెర్సీ సినిమా రిలీజై 3 ఏళ్లు అవుతుంది.
ఈ సందర్భంగా సర్ ప్రైజింగ్ గా సినిమా నుండి ఓ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు.అర్జున్ మళ్లీ క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న టైం లో అతని భార్య సారా తండ్రి వచ్చి అతనికి జాబ్ లో రీజాయిన్ అయ్యేందుకు కావాల్సిన డబ్బు ఇచ్చి క్రికెట్ ఆపేయమని చెబుతాడు.
రియాలిటీలో బ్రతకమని చెబుతాడు.చాలా అద్భుతంగా ఉన్న ఈ సీన్ ఇన్నాళ్లు ఎందుకు రిలీజ్ చేయలేదో కానీ జెర్సీ ఫ్యాన్స్ కి ఈ సీన్ చాలా బాగా నచ్చింది.
జెర్సీ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు.నాని, శ్రద్ధ శ్రినాథ్ ల నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది.జెర్సీ సినిమా హిందీలో రీమేక్ చేశారు.అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కొద్దిగా కన్ ఫ్యూజన్ ఏర్పడింది.
నాని జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నారు.ఆల్రెడీ అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ రీమేక్ తో సక్సెస్ అందుకున్న షాహిద్ కపూర్ జెర్సీ తో మరో ప్రయత్నం చేస్తున్నారు.







