కేజీఎఫ్2 మూవీ బడ్జెట్, లాభాల లెక్కలు ఇవే.. యశ్, నీల్ కు లాభాల్లో వాటా ఎంతంటే?

ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కి అంచనాలకు మించి లాభాలను సొంతం చేసుకున్న సినిమాలలో కేజీఎఫ్2 సినిమా కూడా ఒకటి.దాదాపుగా 280 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

కేజీఎఫ్2 నాన్ థియేట్రికల్ హక్కులు 200 కోట్ల రూపాయలకు అమ్ముడవగా థియేట్రికల్ హక్కులు ఏకంగా 350 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు బడ్జెట్ కు సమాన స్థాయిలో లాభాలను అందించింది.

ఈ సినిమా ద్వారా విడుదలకు ముందే దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు మేకర్స్ కు లాభంగా వచ్చింది.అయితే ఈ లాభంలో మూడు వాటాలు ఉన్నాయని హీరో, డైరెక్టర్ కు రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా లాభాల్లో వాటా ఉంటుందని తెలుస్తోంది.తక్కువ ఖర్చుతోనే తెరకెక్కించడం ఈ సినిమాకు కలిసొచ్చింది.కేజీఎఫ్2 కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర డ్రాప్ అయ్యాయి.అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

కేజీఎఫ్2 బాలీవుడ్ లో భారీస్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమా మేకర్స్ కు లాభాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో లాభాలను అందించిన మరో సినిమా లేదనే చెప్పాలి.కేజీఎఫ్2 సినిమా సక్సెస్ సాధించడంతో యశ్ అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

Advertisement

కేజీఎఫ్2 సక్సెస్ తో కేజీఎఫ్3 సినిమా కూడా సంచలన విజయం సాధించాలని యశ్ అభిమానులు కోరుకుంటున్నారు.కేజీఎఫ్3 భారీ బడ్జెట్ తో కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.ప్రశాంత్ నీల్ స్పందిస్తే మాత్రమే కేజీఎఫ్3 సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.కేజీఎఫ్3 సినిమాలో కూడా కేజీఎఫ్2 సినిమాలోని కీలక పాత్రలు ఉంటాయని సమాచారం అందుతోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు