గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్ దంపతులు పాల్గొన్నారు.రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా నేడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా హైద్రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ నందు తన నివాసంలో సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి , తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ లతో కలసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ముందు చూపుతో ముందు తరాలకు ప్రాణ వాయువును వారసత్వంగా ఇవ్వాలని సంకల్పించి హరితహరం అనే గొప్ప కార్యక్రమం ప్రారంభించారని, దాని కొనసాగింపుగా ఎంపి సంతోష్, కేసీఅర్ ఆశయ సాధన ను పూర్తి స్థాయిలో అమలు జరపడం పట్ల వారికి అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.







